తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులు ఎందరో ఉన్నారు. ఈ ఏడాది కంటెస్టెంట్‌లు కూడా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారని చెప్పాలి. అయితే, బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేరు.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఏడో వారం ఎలిమినేషన్ రౌండ్‌లో ఎవరు సేఫ్ జోన్‌లోకి వెళ్తారు, ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారనేది ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ప్రతివారం ట్విస్టులు, టాస్కులు, గొడవలతో ఇంట్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంటుండగా, ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారనే గుసగుసలు బిగ్ బాస్ అభిమానుల మధ్య ఊపందుకున్నాయి.
ఈ వారం నామినేషన్లలో రమ్య మోక్ష, సాయి శ్రీనివాస్, దివ్య, రీతూ, తనూజ, రాము, సంజన, కల్యాణ్ వంటి కంటెస్టెంట్‌లు ఉన్నారు. వీరిలో తనూజ బలమైన కంటెస్టెంట్‌గా నిలవగా, రమ్య మోక్ష చివరి స్థానంలో ఉండటం ఆమె అభిమానులను టెన్షన్‌కు గురి చేసింది.
అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం... ఈ వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయినట్లు కొన్ని ఫ్యాన్ పేజీలు పోస్టులు పెడుతున్నాయి. కానీ దీనిపై అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా రాలేదు. బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడూ అంచనాలకు విరుద్ధంగా సర్ప్రైజ్‌లు రావడంతో ప్రేక్షకులు నిజంగానే రమ్య మోక్ష వెళ్లిపోయిందా? లేదా ఇంకేదైనా ట్విస్ట్ ఉందా? లేక ఫేక్ ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్‌లోనే ఉంచి మళ్లీ కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రమ్య మోక్ష హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె పేరే హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో పచ్చళ్ల పాప గా ఫేమస్ అయిన ఆమె బిగ్ బాస్‌లోకి వచ్చిన మొదటి రోజు నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ తన నేరుగా మాట్లాడే స్వభావం ఇతర కంటెస్టెంట్‌లపై ఆమె చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో జరిగే తగాదాల్లో ఆమె జోక్యం కారణంగా ఆమెకు మద్దతు, వ్యతిరేకత రెండూ సమానంగా దక్కాయి చూడాలి మరి ఏం జరుగుతుందో
ప్రస్తుతం సోషల్ మీడియాలో #RamyaMokshaElimination అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది