జైపూర్ నుంచి ముంబైకి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన 18 నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్లు వెంటనే అప్రమత్తమై విమానాన్ని మళ్లించి టేకాఫ్ అయిన జైపూర్ విమానాశ్రయానికే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ సమయంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.
ఇటీవలే అహ్మదాబాద్‌లో జరిగిన ఘటనతో సహా, ఎయిరిండియాకు చెందిన విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఉన్న మరో విమానంలోనూ ఇలాంటి లోపం తలెత్తిన విషయం తెలిసిందే. అదేగాక హాంకాంగ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం A1315 ల్యాండ్ అయిన వెంటనే పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగిన ఘటన కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        