నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 312 టీఎంసీలకు గాను.. 302 టీఎంసీలకు చేరుకుందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీంతో 18 ఏళ్ల తర్వాత జులైలోనే సాగర్ గేట్లు ఎత్తారని తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలతో పాటు ప్రకృతి కూడా సహకారం అందిస్తోందని నిమ్మల అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే ముందు వరకు సాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పుష్కలంగా నీరందించి పంటలు పండించామని మంత్రి తెలిపారు.
వరద నీటిని వృథాగా సముద్రంలోకి వదలకుండా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటామన్న మంత్రి.. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.