Header Banner

ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..! అంబేద్కర్ 'విదేశీ విద్య' త్వరలో అమలు! వారికి భారీ ఆర్థిక సాయం!

  Tue May 06, 2025 06:57        Politics

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్‌ విద్యానిధి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాలలోని పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించబోతోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద రాష్ట్రంలో అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షలు అందిస్తారు. అదే బీసీ, మైనారిటీలకు రూ.20 లక్షలు.. ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.15 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదించారు. మరో రూ.5 లక్షలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అదనంగా నిర్వహణ ఖర్చుల కోసం ఇవ్వాలని సూచించారు. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులకు 
ఏపీ ప్రభుత్వం అధికారులు ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. క్యూఎస్‌ ర్యాంకింగ్‌ ఆధారంగా టాప్‌-250 యూనివర్సిటీల్లో సీటు వచ్చిన విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం అందించేలా ప్రతిపాదనలు చేశారు. అలాగే ఈ అంబేద్కర్ మళ్లీ ప్రారంభించడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ కొత్త పథకాలతో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి అవకాశం లభిస్తుందని.. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడుతోందన్నారు మంత్రి లోకేష్.

గతంలో టీడీపీ ప్రభుత్వం (2014-2019 మధ్య) అంబేద్కర్, ఎన్టీఆర్ పేర్లతో ఈ విదేశీ విద్యకు సంబంధించిన పథకాన్ని అమలు చేసింది. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్, ఎన్టీఆర్ స్థానంలో జగనన్న విదేశీ విద్యగా ఈ పథకానికి పేరు మార్చారు. అయితే సబ్జెక్టుల వారీగా క్యూఎస్‌ ర్యాంకింగ్‌ ప్రకారం టాప్‌-50 వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారికే సాయం అందేలా ఈ పథకానికి సంబంధించి నిబంధన తెచ్చారనే విమర్శలు వచ్చాయి. తాజాగా కూటమి ప్రభుత్వం కూడా క్యూఎస్‌ ర్యాంకింగ్‌నే ప్రాతిపదికగా తీసుకుంటోంది.. కాకపోతే టాప్‌-250 వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారికి కూడా ఆర్థికసాయం అందించనుంది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. గతంలో కూడా ఎంతోమంది పేద విద్యార్థులు ఈ విదేశీ విద్యానిధి పథకం కింద లబ్ధిపొందారు. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని భావిస్తోంది.


ఇది కూడా చదవండిఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APGovernment #AmbedkarOverseasScheme #StudyAbroad #StudentSupport #ScholarshipAlert