Header Banner

ఘోర విషాదం.. కల్తీ మద్యం కలకలం.. 14 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం!

  Tue May 13, 2025 14:56        India

పంజాబ్ (Punjab) లో ఘోరం చోటుచేసుకుంది. కల్తీ మద్యం (Spurious Liquor) తాగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్సర్లోని మజితా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే చర్యలు తీసుకొని ప్రధాన నిందితుడైన ప్రజ్జీత్ సింగ్ తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశాం. విచారణ సమయంలో సహబ్ సింగ్ అనే మరో నిందితుడి పేరు వెల్లడైంది. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టాం. 

 

ఇది కూడా చదవండి: అయ్యో.. హైవేపై కూల్ డ్రింక్ వ్యాన్ బోల్తా.. కూల్ డ్రింక్ కేసులు ఎత్తుకెళ్లిన జనాలు!

 

ఎక్కడినుంచి ఈ మద్యాన్ని తీసుకొచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నాం. ఇదే మద్యం తాగిన మరికొంతమందిని గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. కల్తీ మద్యం తయారీదారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కేసుపై రెండు వేర్వేరు ఎఫ్ఎ ఆర్లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. పంజాబ్‌లో కల్తీ మద్యం మరణాలు ఇదే మొదటిసారి కాదు. మార్చి 2024లో సంగ్రూర్‌లో 24 మంది, 2020లో రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా కల్తీ మద్యానికి బలయ్యారు. ఇదిలావుండగా, రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపట్టిన 'యుధ్ నశియాన్ విరుధ్' కార్యక్రమం సోమవారంతో 72 రోజులు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో 6,280 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 10,444 మంది డ్రగ్ స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices