మంగళగిరి : జయహో బీసీ బహిరంగసభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగం : బీసీలు అంటేనే భరోసా... బాధ్యత.. భవిష్యత్తు... బీసీలంటే బలహీనవర్గాలు కాదు.. బలమైన వర్గాలుగా చేసింది ఎన్టీఆర్... చంద్రబాబు వచ్చాక బీసీలను మరింత ప్రోత్సహించారు. బీసీలకు సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం... బీసీల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ఇచ్చాం... ఆదరణ పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాం...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బీసీలకు కేంద్రంలో ప్రత్యేకశాఖ ఉండాలని తీర్మానం చేసింది టీడీపీనే... జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించారు. బీసీ సబ్‌ప్లాన్ నిధులు రూ.75 వేల కోట్లను పక్కదారి పట్టించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆప్కాబ్‌ను నిర్వీర్యం చేసింది. బీసీ నేతలపై అనేక కేసులు పెట్టారు... వేధిస్తున్నారు. ఎంతో మంది బీసీలను ఈ ప్రభుత్వం చంపేసింది... అక్కను వేధిస్తున్నారెందుకని ప్రశ్నించిన అమర్నాథ్‌ను వైసీపీ నేతలు అన్యాయంగా చంపేశారు... బీసీలంటే జగన్‌కు చిన్నచూపు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరు... బీసీలకు రాష్ట్రంలో, దేశంలో అనేక పదవులు ఇచ్చింది టీడీపీనే... బీసీల పట్ల టీడీపీకి చిత్తశుద్ధి ఉంది. జగన్ పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం... నా పాదయాత్రలో బీసీల సమస్యలు తెలుసుకున్నా... చేనేతలకు ఇచ్చే అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఓడినా మంగళగిరిలోనే ఉన్నా.. అనేక కార్యక్రమాలు చేపట్టా మంగళగిరికి ఇచ్చిన హామీలేవీ వైసీపీ నిలబెట్టుకోలేదు... నేను గెలిచాక మంగళగిరి ప్రజల సమస్యలు పరిష్కరిస్తా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
మీ బిడ్డనంటున్నాడు... జర జాగ్రత్త ప్రజలారా...!! జగన్ కంపెనీలు కళకళ...రాష్ట్ర ఖజానా దివాలా!
బీసీలకు అండగా మేమున్నాం!! యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి!! పవన్ కల్యాణ్
ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక ప్రకటన!! నేను సైతం అంటూ ఆయన సతీమణి సంచలనం!!
క్యాన్సర్ బారిన పడ్డ ఇస్రో (ISRO) చీఫ్!! అప్పటికే ఉంది అంట!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి