మంగళగిరి : జయహో బీసీ బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం : వందల సమావేశాలు పెట్టి, నేతల అభిప్రాయాలు తీసుకుని బీసీ డిక్లరేషన్ ప్రకటించాం. బీసీ డిక్లరేషన్ గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి... 40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ.. టీడీపీ. బీసీల డీఎన్‌ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉంది. బీసీల రుణం తీర్చుకునేందుకే పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తెచ్చాం...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం... బీసీలకు రూ.4 వేలు పింఛన్ ఇస్తాం... బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తాం... వైసీపీ పాలనలో సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారు. జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించారు. రేజర్వేషన్ తగ్గించడం వల్ల 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారు. ఎవరికైనా పదవులు దక్కకుంటే నామినేటెడ్ పదవులు ఇస్తాం.
వైసీపీ పాలనలో బీసీలు అన్ని విధాలా మోసపోయారు!! మన్నవ మోహనకృష్ణ
చట్టబద్ధంగా బీసీల కులగణన చేపట్టాలి... బీసీల ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలి... బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తాం. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం... ఇది అవసరం. బీసీల జోలికి ఎవరైనా వస్తే జాగ్రత్త.. అని హెచ్చరిస్తున్నాం... పరిశ్రమలు పెట్టేలా బీసీ వర్గాలను ప్రోత్సహిస్తాం. బీసీలకు షరతులు లేకుండా విదేశీవిద్య పథకం అమలు చేస్తాం... పెళ్లికానుకను తిరిగి ప్రవేశపెడతాం... ప్రతిఏడాది కుల ధ్రవీకరణ తీసుకునే వ్యవస్థ రద్దు చేస్తాం. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తాం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
చంద్రన్న బీమా కింద బీసీలకు రూ.10 లక్షలు ఇస్తాం. లంచాలు లేకుండా బీసీలకు ధ్రువపత్రాలు ఇచ్చేలా చూస్తాం... మేం వచ్చిన ఏడాదిలోగా బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు పూర్తి చేస్తాం... బీసీల దశ, దిశ మార్చడం కోసమే బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. బీసీలు లేకుంటే సమాజం ముందుకెళ్లదు.. నాగరికతకు వారే మూలం... చెరువులు, దోబీఘాట్‌లపై మళ్లీ హక్కు కల్పిస్తాం. పరిశ్రమలు పెట్టేలా కురబ, యాదవలను ప్రోత్సహించాం. యాదవుల జీవితాల్లో వెలుగులు తెస్తామని హామీ ఇస్తున్నాం.
మీ బిడ్డనంటున్నాడు... జర జాగ్రత్త ప్రజలారా...!! జగన్ కంపెనీలు కళకళ...రాష్ట్ర ఖజానా దివాలా!
బీసీల్లో ఉన్న 157 కులాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం... టీడీపీ వచ్చాకే బీసీల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. అచ్చెన్నాయుడు, కొల్లు, యనమల, కళా వెంకట్రావుపై కేసులు పెట్టారు. బీసీ నాయకత్వంపై గొడ్డలివేటు వేసిన పార్టీ వైసీపీ... ఎంపీ ఇస్తామన్నా వదులుకుని గుమ్మనూరు టీడీపీలోకి వచ్చారు. బీసీలను ఊచకోత కోసే పల్నాడు వైసీపీ నేతలను మార్చగలరా? నలుగురు రెడ్లతో పెత్తందారి వ్యవస్థను నడుపుతున్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదు. బీసీలంటే పల్లకీలు మోసే బోయీలు కాదని నిరూపించాలి...
బీసీలకు అండగా మేమున్నాం!! యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి!! పవన్ కల్యాణ్
బీసీలంటే బ్యాక్‌బోన్ సొసైటీ అని నిరూపించాలి... పదవులు, అధికారం కోసం మేం పోరాడటం లేదు... భావితరాల భవిష్యత్తు కోసమే నేను, పవన్ పోరాడుతున్నాం. మంగళగిరిలో అందరికీ ఇంటి పట్టాలు ఇచ్చే బాధ్యత నాది. మంగళగిరిలో 20 వేల టిడ్కో ఇళ్లు నిర్మించి ఇస్తాం... చేనేత కార్మికుల ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటాం... మేం వచ్చాక స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం... మేం వచ్చాక అమరావతిలో యూ-1 జోన్ ఎత్తివేస్తాం... రాష్ట్ర భవిష్యత్తుకు రాబోయే ఎన్నికలు చాలా కీలకం... నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బీసీలంతా సహకరించాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
నాకింత అన్నం ఉంటే చాలు... కన్నీళ్లు పెట్టుకున్న అజయ్ ఘోష్!!
వైసీపీ పాలనలో బీసీలు అన్ని విధాలా మోసపోయారు!! మన్నవ మోహనకృష్ణ
వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు!!
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక ప్రకటన!! నేను సైతం అంటూ ఆయన సతీమణి సంచలనం!!
క్యాన్సర్ బారిన పడ్డ ఇస్రో (ISRO) చీఫ్!! అప్పటికే ఉంది అంట!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి