అనంతపురం : కాంగ్రెస్ న్యాయ సాధన సభలో షర్మిల ప్రసంగం : ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు... రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు... నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారు. జగనన్న ప్రత్యేక హోదా కోసం గతంలో దీక్షలు చేశారు,మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదన్నారు, జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారని ప్రజలు నమ్మారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సీఎం అయ్యాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారా? అధికారంలోకి వచ్చాక వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారా ? బీజేపీతో వైసీపీ ఒక్కసారి పోరాటం చేయలేదు . హోదాపై వైసీపీ పోరాడకుండా బీజేపీతో కుమ్మక్కైంది. స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టారు. వైసీపీ నాయకులు బీజేపీకి బానిసలుగా మారారు. వైసీపీ పాలనలో మూడు రాజధానులు చేస్తామన్నారు. మూడింట్లో ఏపీకి కనీసం ఒక్క రాజధాని అయినా ఉందా? బీజీపీతో ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు?
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఒక్క వాగ్దానమైనా నిలుపుకున్నందుకు పొత్తు పెట్టుకున్నారా ? ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాకే ఓట్లు అడగాలి. గతంలో 3 వేల కి.మీ పాదయాత్ర చేసి జగన్ పార్టీని నిలబెట్టాను. చెల్లి అని చూడకుండా జగన్ వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. డబ్బులతో సైన్యాన్ని పెట్టి సోషల్ మీడియాలో దూషిస్తున్నారు. ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా నీ కోసం పాదయాత్ర చేసింది. నా గురించి.. నా భర్త గురించి ఇష్టారీతిన దూషిస్తున్నారు.
చంద్రబాబును కలిసిన కంభంపాటి రామ్మోహన్ రావు, నిమ్మల కిష్టప్ప!
జగన్.. మీరు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నారు - నేను వైఎస్ఆర్ బిడ్డను.. భయపడేదాన్ని కాదు. నాది వైఎస్ఆర్ రక్తం... పులి కడుపులో పులే పుడుతుంది. ప్రజలకు మేలు చేయాలనే ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టా... ప్రత్యేకహోదా వచ్చే వరకు రాష్ట్రంలోనే ఉంటా. పోలవరం కట్టే వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపోను... రాష్ట్ర ప్రజల హక్కులు నెరవేరే వరకు ఇక్కడి నుంచి కదలను అని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
పొత్తు ధర్మంతో టికెట్లు వదులుకున్న నేతలతో చంద్రబాబు భేటీ!! త్యాగాలు తప్పవు??
టీడీపీ అధినేత చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు సమావేశం!
కడపను డిప్యూటీ సీఎం గంజాయి నగరంగా మార్చారు -శ్రీనివాస్ రెడ్డి
ఓడిన దగ్గరే గెలవాలని మంగళగిరిలో మళ్లీ పోటీ చేస్తున్నా -నారా లోకేశ్
జిల్లాల వారీగా మాఫియాలను పెంచి పోషిస్తున్న వైసీపీ !! పోలింగ్ బూత్ల వద్ద కూడా రెచ్చిపోయే ప్రమాదం!!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి