ఏపీలో వైసీపీ అధినాయకుడి పైశాచికత్వం పరాకాష్టకు చేరింది.
ఈయన విశాఖపట్నం జిల్లా సింగివలస లో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నాయకుల క్యారీకేచర్లను పెట్టి వారి కార్యాకర్తలతో పిడిగుద్దులు కురిపించడం చూస్తుంటే పిచ్చి పరాకాష్టకు చేరిందని చెప్పాలి.
ప్రభుత్వంలో ఈయన ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతూ ఉంటే దిష్టిబొమ్మ దహనం చేస్తే కేసులు నమోదు చేసిన పోలీసులు సింగివలసలో జరిగిన సంఘటనపై సమాధానం చెప్పాలి.
ప్రతిపక్ష నాయకులపై కక్ష ఉంటే ఈయన సభలలో వారిపై ఎన్నో రకాల విమర్శలు చేస్తూ పోరాటం చేస్తున్నారు.
ప్రజలు ఈయన మాటలను పట్టించుకోకపోవడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకు జనాలు పోటేత్తడంతో జగన్ బ్యాచ్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ పరిస్థితులలో ప్రతిపక్ష నాయకుల బొమ్మలను పెట్టి వాటి ముందు బాక్సింగ్ బ్యాగులు పెట్టి పైశాచికత్వం పెరిగిన కొంతమందిని అక్కడ పెట్టి బాక్సింగ్ కిక్కులు ఇప్పిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నత స్థానంలో కలిగిన వ్యక్తి ఉన్నతమైన భావాలతో కలిగి ఉండాలి.
ఒక ముఖ్యమంత్రి సభలోనే ఇటువంటి వికృతమైన చేష్టలకు దిగితే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉన్నట్లా లేనట్లా?
ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ పరిధిలోని ప్రధాన రోడ్లలో సభలు సమావేశాలు జరపకుండా జీవో నెంబర్ వన్ తీసుకొచ్చిన ఈయన ఈ చేష్టలను ఎలా ప్రోత్సహిస్తారు.
ముఖ్యమంత్రి సభ జరుగుతూ ఉంటే ఆ జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులను అందర్నీ గృహనిర్బంధాలు చేస్తున్నారు పోలీసులు.
ముఖ్యమంత్రి సభలోని ప్రతిపక్ష నేతలను అవమానించే విధంగా ప్రవర్తిస్తే అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీల అభిమానులు ఆగ్రహిస్తే జరిగే విధ్వంసానికి బాధ్యులు ఎవరు.
ఘర్షణలను తలెత్తకుండా లా అండ్ ఆర్డర్ సమస్య చెలరేగకుండా చర్యలు తీసుకోవలసిన పోలీసులు, ప్రభుత్వమే ప్రతిపక్ష నేతలను రెచ్చగొట్టే చర్యలు చేపడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియనిది కాదు.
రేపు టిడిపి జనసేన సభలలో కూడా ఈయన కటౌట్లు పెట్టి ఇటువంటి చర్యలే చేపడితే బాధ్యులు ఎవరు.
ఇప్పటికే ఈయన సభలు జనాలు లేక వెలవెలబోతున్నాయి.
ప్రతిపక్ష నాయకులపై ఇటువంటి చర్యలు చేపడితే ఆందోళనలు చేయడానికి అయినా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు జగన్ సభలకు వస్తారన్న కుట్ర కోణం దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది.
వచ్చే సభలో కూడా ఇటువంటి కటౌట్లు బాక్సింగ్ బ్యాగులు పెట్టి రెచ్చగొట్టే చర్యలు చేపట్టే ప్రతిపక్ష పార్టీల నేతలు ఘర్షణకు దిగే అవకాశాలు ఉన్నాయి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈయన ప్రభుత్వానికి కూడా కావాల్సింది ప్రతిపక్షాలు ఘర్షణ వాతావరణం సృష్టించడమే.
ఘర్షణ వాతావరణం చెలరేగే విధంగా ఈయన సభలలో కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు.
రాష్ట్రంలో ఈయన ప్రభుత్వం ఓడిపోతుందన్న భయం ఆ పార్టీ అగ్రనాయకత్వానీకి నిద్రలేకుండా చేస్తుంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రగల్భాలు పలికిన ఈయన నేడు ప్రత్యేక హోదా రాకపోవడానికి టిడిపి జనసేన బిజెపి కారణమంటూ ప్రచారం చేయడం చూసి ప్రజలు నవ్వుతున్నారు.
ముఖ్యమంత్రిగా హుoదా తనాన్ని ఈయన చేతల ద్వారా గాని, మాటల ద్వారా గాని ఒక్కరోజు కూడా ప్రదర్శించలేదు అనడానికి 100 చెప్పవచ్చు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అన్న,తమ్ముడు అంటూ ముఖ్యమంత్రి హోదాలో ఈయన మాట్లాడడం దిగజారుడు తనమే.
అధికారం చేపట్టిన వారం రోజులలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను అక్రమ కట్టడం అంటూ కూల్చివేసిన ఈయన రాష్ట్రములో మరెక్కడా ఒక్క అక్రమ కట్టడాన్ని కూడా కూల్చిన దాఖలాలు లేవు.
ఈయన పాలన పై రాష్ట్రంలో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
ఈయన పాలన వైఫల్యాలతో విసిగి వేసారిన ప్రజలు రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కూడళ్ళలో జగన్ బొమ్మలను పెట్టి వెళ్లి వచ్చేవారు చెప్పులతో కొడుతూ ఉంటే అప్పుడు కూడా పోలీసులు చేష్టలుడిగి చూస్తారా?
ఈయన సభలోనే పిచ్చి పరాకాష్టకు చేరి సైకో మనస్తత్వంతో ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీల నాయకుల బొమ్మలపై చేసిన ఆకృత్యాలను చూసి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అసహ్యించుకుంటున్నారు.
జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు మహిళలు కావడం, వారిలో బిజెపి అధ్యక్షురాలు అన్న నందమూరి తారకరామారావు కుమార్తె పురందరేశ్వరి కావడం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, జగన్ చెల్లి కావడంతో వారి ఫోటోలు పెట్టి ఇటువంటి చర్యలు చేపడితే ప్రజలు చెప్పుతో కొడతారని వైసీపీ నేతలు భయపడినట్లు అన్నారు.
బిజెపి నేతగా కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతగా హస్తం చూపిస్తూ కోటు వేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి ఫోటోను పెట్టారు.
తెలుగుదేశం జనసేన పార్టీ అభిమానులు తమ నాయకులపై ఈయన సభలో చేసిన వికృత క్రీడకు రెచ్చిపోతే రాష్ట్రం రావణ కాష్టం కావడం తథ్యం.
రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చి ప్రతిపక్ష నేతలను దోషులుగా చేసి మళ్ళీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈయన చేస్తున్న గుంటనక్క రాజకీయాన్ని ప్రతిపక్ష నేతలు గ్రహించారు.
నాయకులను కార్యకర్తలను ఆ దిశగా మళ్ళించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎన్నికలు సమీపించే కొద్దీ జగన్ ఈయన రాష్ట్రంలో తీవ్ర అలజడలు సృష్టించడానికి ఎన్ని ప్రయత్నాలు అయినా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు జాగ్రత్తతో వ్యవహరించకపోతే రాష్ట్ర భవిష్యత్తు ఆగం మీద మారే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం అనుసరిస్తున్న పాలనలలో ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రజలు ఓట్ల రూపంలో ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఉన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి