ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశం. దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ రాయితీలు ప్రకటించింది. టాటా నెక్సాన్, టియాగో ఈవీపై రూ. 1.2 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. కార్లలో ఉపయోగించే బ్యాటరీల ధరలు తగ్గడంతో ఆ మేరకు ధరలు తగ్గించింది.
ధర తగ్గింపు తర్వాత టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర భారత్‌లో రూ. 7.99కు దిగొచ్చింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

నెక్సాన్ ధర రూ. 14.49 లక్షలు కాగా, లాంగ్ రేంజ్ నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ. 16.99 లక్షలకు తగ్గింది. ధరల తగ్గింపుపై టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ... ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో బ్యాటరీల ధరే కీలకమని పేర్కొన్నారు. ఇటీవల బ్యాటరీ సెల్ ధరలు తగ్గముఖం పట్టడంతో ఆ మేరకు వాహనాల ధరలు కూడా తగ్గించినట్టు తెలిపారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group