ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలు జిల్లా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం కర్నూలులో జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్‌లో జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ సంస్థ ఏర్పాటు అవుతోంది. ఈ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 5000 మందికి, పరోక్షంగా 10,000 మందికి పైగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఈ స్టీల్ ఫ్యాక్టరీ పనులు దాదాపు 80 శాతం మేర పూర్తి కావడంతో మరి కొద్ది రోజుల్లోనే ఇది పూర్తిగా అందుబాటులోకి రానుంది. మరోవైపు పూర్వకల్లు ప్రాంతంలో ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్రోన్ హబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
ఇంకా చదవండి: గుడ్ న్యూస్: 30 రోజుల శిక్షణ - తర్వాత ఉద్యోగం! ఆ జిల్లా వాళ్ళు ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి!
ఇందుకోసం ప్రభుత్వం తరఫున 300 ఎకరాలను కేటాయించి డ్రోన్ తయారీ శిక్షణ హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు ఇప్పటికే స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను అందించారు. మరోవైపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో నేత కార్మికులు అధికంగా ఉండడంతో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే గత వైయస్సార్సీపి ప్రభుత్వ హయాంలో దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు కాలేదు. దీంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని-మంత్రాలయం బైపాస్ రోడ్డు సమీపంలో దాదాపు 77 ఎకరాలలో టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టెక్స్‌టైల్ పార్క్ అందుబాటులోకి వస్తే దాదాపు పది వేల మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చినటువంటి బీసీ సంక్షేమ, జౌళి శాఖ మంత్రి సవిత టెక్స్‌టైల్ పార్క్‌కు సంబంధించినటువంటి భూములను పరిశీలించి రూ.3.75 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!
అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?
26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!
ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!
అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: