వైకాపా అధినేత జగన్ ఏపీకి ఏం చేశారని శాలువా కప్పాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసి తొమ్మిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచినందుకు, ఐదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు శాలువా కప్పాలా అని ప్రశ్నించారు. దేశంలోనే అవినీతి సామ్రాట్ అని జగన్కు సన్మానం చేయాలా? అంటూ విమర్శించారు. విద్యుత్ వ్యవస్థలను రూ. లక్ష కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని మంత్రి దుయ్యబట్టారు. జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. జగన్ అవినీతి ఆనాడు రాష్ట్రం దాటితే.. ఇప్పుడు దేశం దాటిందన్నారు. రాష్ట్రం పరువు తీయడమే కాకుండా గొప్పలకు పోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తప్పులను కప్పిపుచ్చుకొని అవినీతిని కూడా గొప్పగా చెప్పుకోవడం జగన్కే సాధ్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. వర్షాల నేపథ్యంలో అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ ఏపీలో తుపాన్ ప్రభావంతో వర్ష సూచన నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీవర్షం, ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు ఒరిగే ప్రమాదం ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమస్యపై ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించాలన్నారు. విద్యుత్ సరఫరాకు అవాంతరాలు ఏర్పడితే తక్షణం పునరుద్ధరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!
కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!
మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!
షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: