వైసీపీకి మరో షాక్ తగిలింది. కైకలూరు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పార్టీని వీడారు. ఎమ్మెల్సీ పదవితో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు జయమంగళ వెంకటరమణ శనివారం ప్రకటించారు. రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ మోసేనురాజుకు పంపించినట్లు తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కైకలూరు నియోజకవర్గం నుంచి గతంలో జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా గెలిచారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ సమక్షంలో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దీంతో ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో వెంకటరమణ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా పలువురు కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే జయమంగళ వెంకటరమణ వైసీపీకి గుడ్‌బై చెప్పారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!
ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!
శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: