తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత నక్కా ఆనందబాబుపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసేందుకు బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్ నిరాకరించింది. 2010లో ఓ నిరసనకు సంబంధించి చంద్రబాబు, ఆనందబాబును ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించే క్రమంలో జైలు సిబ్బందిపై వారు దాడిచేసినట్టు క్రిమినల్ కేసు నమోదైంది. తాజాగా, ఈ కేసును విచారించిన జస్టిస్ మంగేశ్ పాటిల్, శైలేశ్ బ్రహ్మేలతో కూడిన ధర్మాసనం.. నేరారోపణలో నిందితుల ప్రమేయాన్ని బయటపెట్టేందుకు తగిన ఆధారాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేశం లేదని అభిప్రాయపడింది.
ఇంకా చదవండి: పోలింగ్ రోజు సోమవారం భర్త మృతి! బాధలోనూ ఓటు మరువని భార్య!
ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, గాయపడిన పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారని, దీనినిబట్టి నేరానికి సంబంధించి తగిన సమాచారం ఉన్నట్టేనని, కాబట్టి కేసును కొట్టివేయడం సముచితం కాదని ధర్మాసనం పేర్కొంది. నిందితులపై కేసు నమోదు, దర్యాప్తు వంటి వాటిలో చట్టవిరుద్ధంగా ప్రవర్తించినట్టు తమకు అనిపించలేదని పేర్కొంది. అయితే, 13 సెప్టెంబర్ 2023న చంద్రబాబుకు మంజూరు చేసిన మధ్యంతర ఉపశమనాన్ని జులై 8 వరకు పొడిగించింది. ఫలితంగా ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకాకుండా చంద్రబాబుకు మినహాయింపు లభించింది. కాగా జులై 2010లో చంద్రబాబు, ఆనందబాబు, మరో 66 మందిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: