ఇప్పటివరకూ దాఖలవుతున్న నామినేషన్లలో రాజకీయ నేతల ఆస్తులు, అప్పులు, కేసుల గురించే చర్చ జరుగుతుంటే.. ఏపీ మంత్రి ఆర్కే రోజా తాజాగా దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో మాత్రం ఓ ఆసక్తికరమైన అంశం కనిపించింది. అదేంటంటే మంత్రి రోజాకు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ లో ఓ చిట్ ఉన్నట్లు తేలింది. మరోసారి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆర్కే రోజా నిన్న ఎన్నికల నామినేషన్ తో పాటు తన ఆస్తులు, అప్పుల వివరాలతో అఫిడవిట్ కూడా సమర్పించారు.
ఇంకా చదవండి: అమరావతి: అభ్యర్థులకు బీఫామ్స్ అందజేసిన చంద్రబాబు! పార్లమెంటుకు వచ్చి తీరాలి.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ..
ఇందులో రోజాకు మొత్తం 4.58 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తేలింది. అలాగే 6.05 కోట్ల స్ధిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో రోజా తనకు ఆరు కార్లు ఓ బైక్ ఉన్నట్లు చెప్పగా.. ఈసారి 9 కార్లు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. వీటితో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్ లో తనకు ఓ చిట్ ఉన్నట్లు వెల్లడించారు. తనకు మార్గదర్శి చిట్ ఫండ్స్ లో ఎల్టీ0330వీ ఎంఏ/48 నంబరుతో రూ.39.21 లక్షల విలువైన చిట్ ఉన్నట్లు ఆర్కే రోజా తన ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. మరో ప్రైవేటు చిట్ లో తనకు రూ.32.90 లక్షల చిట్ ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి తరుణంలో రోజా మార్గదర్శిలో ఇంకా చిట్ కొనసాగిస్తుండటం విశేషం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..
అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: