భారత్‌లోని పలు కంపెనీల సీఈవోలు బ్రిటన్‌ షాడో విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీతో సమావేశమైనట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఈ భేటీలో లండన్‌లో జరుగుతున్న వాచ్‌ దొంగతనాలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. సమావేశాలు, వ్యాపార అవసరాల నిమిత్తం నగరానికి వచ్చినప్పుడు తమవద్ద ఉండే ఖరీదైన వస్తువులు దొంగతనానికి గురవుతున్నట్లు వారు ఆరోపించారు. దీనిపై దిల్లీకి చెందిన ఓ సంస్థ సీఈవో మాట్లాడుతూ... ఇటీవల లండన్‌లో పర్యటించిన భారతీయ సీఈవోలలో చాలామంది దోపిడీకి గురయ్యారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

వారివద్ద ఉండే లగ్జరీ వాచ్‌లు, ఖరీదైన మొబైల్‌ ఫోన్లు, ఇతర వస్తువులే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్నాయి. దీనిపై లండన్‌ పోలీసులు చర్యలు తీసుకోవాలి. మాకు సౌకర్యంగా లేని ప్రాంతానికి ఎందుకు వెళ్లాలి!?  లండన్ నగరంలో 2022తో పోలిస్తే... గతేడాదిలో వాచ్‌, మొబైల్‌, హ్యాండ్‌బ్యాగ్‌ దొంగతనాలు 27 శాతం మేర పెరిగినట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది. గత ఐదేళ్లలో సుమారు 29 వేల లగ్జరీ వాచ్‌లను దొంగతనం చేసినట్లు వెల్లడించింది. 2022లో 52 వేల దొంగతనాలు నమోదవగా, 2023లో 72 వేల కేసులు నమోదైనట్లు మెట్రోపాలిటన్‌ పోలీసులు వెల్లడించారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group