మన శరీరానికి అందాల్సిన అత్యవసర పోషకాల్లో ‘విటమిన్ సీ’ మరింత కీలకమైనది. ఇది సరిగా అందకపోతే శరీరం బలహీనమైపోతుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన చర్మం నుంచి గుండె దాకా అవయవాల పనితీరు దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. శరీరంలో కనిపించే కొన్ని రకాల లక్షణాల ఆధారంగా... ‘విటమిన్ సీ’ లోపం ఉన్నట్టుగా గుర్తించవచ్చని వివరిస్తున్నారు.
ఇంకా చదవండి: టమాటా, క్యారెట్లు, పాలకూరను ఉడకబెట్టి తినాలా? పచ్చిగా తినాలా?
ఐరన్ లోపం.. రక్త హీనత...
మన శరీరం ఐరన్ ను సరిగా సంగ్రహించాలంటే కూడా విటమిన్ సీ తప్పనిసరి. తగినంత విటమిన్ సీ లేకుంటే ఐరన్ సరిగా అందక.. రక్త హీనత సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా శాఖాహారం తీసుకునేవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రక్త నాళాల బలహీనత...
‘విటమిన్ సీ’ లోపం వల్ల శరీరంలో కొల్లాజెన్ సరిగా ఉత్పత్తి కాదు. దీనితో రక్త నాళాల గోడలు బలహీనమై... చిన్న ఒత్తిడికే దెబ్బతింటూ ఉంటాయి. ఏదైనా చర్మంపై కాస్త గీరుకుపోయినా గాయం ఎక్కువగా అవుతూ ఉంటుంది.
కండరాల బలహీనత, నొప్పి..
శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి కోసం విటమిన్ సీ అత్యంత ఆవశ్యకం. కొల్లాజెన్‌తోనే కండరాలు, ఎముకల మధ్య అనుసంధానం దృఢంగా ఉంటుంది. లేకపోతే కండరాలు బలహీనమై, నొప్పిగా ఉంటుంది. ఈ లక్షణాలుంటే విటమిన్ సీ లోపంతో బాధపడుతున్నట్టే.
ఇంకా చదవండి: వాకింగ్‌లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? మీకు ఏ వాకింగ్ సెట్ అవుతుంది?
రోగ నిరోధక వ్యవస్థకు దెబ్బ..
శరీరంలో విటమిన్ సీ లోపం ఉంటే రోగ నిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. సీజనల్ వ్యాధులకు చాలా సులువుగా లోనవుతూ ఉంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి తరచూ వేధిస్తుంటాయి. న్యుమోనియా సమస్య ఉన్నవారికి ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది.
బలహీనమైన ఎముకలు...
శరీరంలో ఎముకలు దృఢంగా ఉండటానికి ‘విటమిన్ సీ’ తగినంత అందాల్సిందే. ఎముకలు తయారయ్యే క్యాల్షియంను శరీరం సరిగా సంగ్రహించేందుకు విటమిన్ సీ తోడ్పడుతుంది. దీని లోపం వల్ల శరీరం సరిగా క్యాల్షియంను శోషించుకోలేక.. ఎముకలు బలహీనమై ‘ఆస్టియో పోరోసిస్’ సమస్య తలెత్తుతుంది.
పెళుసుబారిన గోర్లు, వెంట్రుకలు..
మన గోర్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండటానికి ‘విటమిన్ సీ’ అవసరం. శరీరంలో ‘విటమిన్ సీ’ లోపం ఉంటే... గోర్లు పెళుసుబారిపోతాయి. వెంట్రుకలు కళావిహీనమై, సులువుగా తెగిపోతుంటాయి.
ఇంకా చదవండి: మందులే అవసరం లేదు! ఇలా చేస్తే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది!
బలహీనత, మూడ్ స్వింగ్..
శరీరంలో శక్తి ఉత్పత్తయ్యే ప్రక్రియలో ‘విటమిన్ సీ’ కూడా పాలు పంచుకుంటుంది. దీని లోపం వల్ల ఆ ప్రక్రియ దెబ్బతింటుంది. అందువల్ల తగినంత ఆహారం తీసుకుంటున్నా కూడా శరీరం బలహీనంగా ఉన్న భావన కలుగుతుంది. ఇక శరీరంలో న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఉత్పత్తిలోనూ విటమిన్ సీ పాత్ర ఉంటుంది. దీనిలోపం వల్ల ఆ వ్యవస్థ దెబ్బతిని ‘మూడ్ స్వింగ్స్’ సమస్య వస్తుంది. మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
చిగుళ్లు దెబ్బతిని రక్తం కారడం..
‘విటమిన్ సీ’ లోపం వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. చిన్నపాటి కదలిక, కాస్త గట్టిగా బ్రషింగ్ చేసినా చిగుళ్ల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. తరచూ ఇలా జరుగుతున్నట్టయితే ‘విటమిన్ సీ’ లోపంగా అనుమానించాల్సిందే.
కంటి చూపు దెబ్బతినడం...
శరీరానికి విటమిన్ సీ సరిగా అందకుంటే... వయసు మీదపడటం వల్ల వచ్చే లక్షణాలు మరింత వేగవంతం అవుతాయి. ఈ క్రమంలో కంటిచూపు వేగంగా తగ్గిపోతుంటుంది.
కాగా మీ శరీరంలో అధికంగా 'విటమిన్ సీ' ఉండాలి అంటే తినవలసిన పదార్థాలు ఇవే.. జామకాయ, నారంజి, స్ట్రాబెరీ, నిమ్మకాయ, ఉసిరికాయ.
ఇంకా చదవండి: కీలక అప్డేట్.. ఏ పథకానికైనా అర్హత ఆ కార్డే.. ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వం! ఆ వివరాలు మీ కోసం..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!
మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!
షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: