భారత్‌లో టూవీలర్ మార్కెట్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలైన టీవీఎస్, హోండా, ఇతర కంపెనీలు పోటాపోటీగా బైక్‌లు, స్కూటీలను విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా స్కూటీల విభాగంలో భారత్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న యాక్టివా, ఎప్పటికప్పుడు కొత్త మోడల్‌ను రిలీజ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే త్వరలోనే యాక్టివా 7G మోడల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. బడ్జెట్ ధరలోనే అద్భుతమైన మైలేజీ, స్టైలిష్ లుక్‌తో దీన్ని విడుదల చేయనుంది. లీకేజీలను బట్టి చూస్తే.. హోండా యాక్టివా 7Gని కంపెనీ 2025లో లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే హోండా మాత్రం దీని లాంచింగ్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీని ధర రూ. 80,000 నుంచి రూ. 90,000 మధ్య ఉండొచ్చని ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్‌అంచనా వేస్తున్నారు. యాక్టివా 7జీలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. కంపెనీ డిజిటల్ స్క్రీన్, మొబైల్ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జర్‌ను అందించనుంది. ఇక ఈ స్కూటీలో ఎల్‌ఈడీ లైట్స్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. కార్లలో ఉన్న మాదిరిగా దీనిలోనూ పుష్ బటన్ స్టార్ట్ ఫీచర్‌ను చేర్చే అవకాశం ఉంది.
ఇంకా చదవండి: తక్కువ ధరకే మార్కెట్లోకి మారుతి సుజుకి కొత్త కారు! లేటెస్ట్ ఎడిషన్‌లో అప్‌గ్రేడ్స్ ఇవే! ఈ అవకాశం మల్లి రాదు!
ఈ స్కూటీలో అలాయ్ వీల్స్, సైలెంట్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉండవచ్చు. యాక్టివా 7G స్కూటీలో మైలేజీకి కంపెనీ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక లీటర్‌కు ఈ స్కూటర్ ఏకంగా 55 నుంచి 60 కి.మీల మైలేజ్ ఇవ్వనుందని సమాచారం. దీనిలో బీఎస్ 110 సీసీ ఇంజిన్ 7.6 bhp పవర్, 8.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక, డిజైన్ విషయానికి వస్తే.. యాక్టివా 7జీలోని స్పోర్టీ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీనిలోని ఎల్ఈడీ హెడ్లైట్లు, ముందు భాగంలోని డిజైన్ ఆకట్టుకునే లుక్‌ను అందిస్తాయి. దీని వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లైట్లు, కొత్త గ్రాబ్ రైల్ వంటి ఫీచర్లను చేర్చే అవకాశం ఉంది. యాక్టివా 7G మోడల్‌లో కంపెనీ డిజిటల్ మీటర్ కన్సోల్‌ను అందించినట్లు తెలుస్తోంది. ఈ డిజిటల్ మీటర్ కన్సోల్ ద్వారా స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్) వంటి సేఫ్టీ ఫీచర్లను సైతం ఇందులో అందించనున్నట్లు సమాచారం. భారత స్కూటీ మార్కెట్లో ప్రస్తుతం టీవీఎస్, హోండా మధ్య పోటీ తీవ్రమైందని చెప్పొచ్చు. ఇటీవలే టీవీఎస్ జూపిటర్ 110ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీంతో, దీనికి పోటీగా హోండా యాక్టివా 7జీని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. హోండా నుంచి గతంలో విడుదలైన యాక్టివా 4జీ, 5జీ, 6జీ స్కూటీలకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు యాక్టివా 7జీ లాంచింగ్‌తో భారత స్కూటీ మార్కెట్‌లో తన పట్టు నిలుపుకోవాలని హోండా కంపెనీ భావిస్తోంది.
ఇంకా చదవండి: మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: