వాహన రంగంలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సంస్థ టాటా మోటార్స్. టాటా సుమో, టాటా ఏస్ వంటివి ఎంతో పాపులర్ అయ్యాయి. టాటా కంపెనీ నుంచి అప్పట్లో కేవలం లక్ష రూపాయల బేసిక్ ధరలోనే ఐకానిక్ నానో కారు లాంచ్ అయింది. అయితే, కొన్ని కారణాలతో టాటా నానో సక్సెస్ కాలేదు. దీంతో వీటి ఉత్పత్తి కూడా ఆగిపోయింది. తాజాగా మరోసారి నానో కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరికొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ ఈ డిసెంబర్‌లో ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది. ఈ కారు ధర, ఫీచర్లు, విశేషాలు తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు ఈవీలపై ఫోకస్ పెట్టాయి. ఇదే క్రమంలో కేవలం రూ.2.5 లక్షల బేసిక్ ధరతోనే టాటా నానో ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అవుతోంది. రతన్ టాటా కలల కారుగా వస్తున్న టాటా నానో ఈవీ.. వాహన రంగంలో సరికొత్త ఒరవడిని తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సిటీ డ్రైవింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేశారు. తక్కువ ధరతో స్టైల్, కంఫర్ట్ విషయంలో కాంప్రమైస్ కాకుండా కారును టాటా తీసుకొస్తోంది. టాటా నానో ఈవీ 17kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయొచ్చని సమాచారం. గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లగలదని తెలుస్తోంది. మోడర్న్ ఎలక్ట్రిక్ టెక్నాలజీతో వస్తున్న ఈ వెహికల్ 10 సెకండ్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఫుల్ ఛార్జింగ్ కావడానికి 6 నుంచి 8 గంటల సమయం తీసుకుంటుంది. ఇంటీరియర్ స్పేస్ కూడా కాస్త ఎక్కువగానే రానుంది. నలుగురు సౌకర్యంగా కూర్చునేలా ఇంటీరియర్ డిజైన్ రానున్నట్లు సమాచారం. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. టాటా నానో ఈవీ ఒక కాంపాక్ట్ కారు. అద్భుతమైన డిజైన్‌తో వస్తున్న ఈ కారు పొడవు 3,164mm, వెడల్పు 1,750mm, వీల్ బేస్ 2,230mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180mmగా ఉంది. దీంతోపాటు, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్‌ఫుల్ 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(EBD)తో కూడిన యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్(ABS) వంటి ఫీచర్లన్నీ ఇందులో ఉంటాయి. ఏసీ, పవర్ స్టీరింగ్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. టాటా నానో ఈవీ బేస్ వేరియంట్ ధర రూ.2.5 లక్షలతో ప్రారంభం కానున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హైఎండ్ ఫీచర్స్‌తో కూడిన టాప్ వేరియంట్ ధర రూ.8 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. ఏదేమైనా, ఈవీలలో టాటా నానో మోస్ట్ అఫర్డబుల్ కారుగా నిలవనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!
టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్!
వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!
నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్‌లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: