సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
ఇంకా చదవండి: ఈ వేడుక గురించి నాగార్జున ఆసక్తికర అప్‌డేట్! పెళ్లి పనులు కూడా వారిద్దరే దగ్గరుండి చూసుకోవాలి!
బాలీవుడ్ నుంచి కూడా నయనతారకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో నయనతార సోషల్ మీడియాలో ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో పడేందుకు వరుస బాలీవుడ్ ఈవెంట్స్‌లో హాజరు అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నయనతార భర్త విఘ్నేష్ శివన్‌లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. నయనతార ,విఘ్నేష్ శివన్ ఇద్దరూ కలిసి ఢిల్లీలో ఓ హోటల్‌లో సందడి చేశారు. అయితే అక్కడున్న వారెవ్వరూ కూడా ఈ సెలబ్రిటీ జంటను పట్టించుకోలేదు. పైగా వాళ్లు ఆ రెస్టారెంట్ చాలా బిజీగా ఉండటంతో టేబుల్ కోసం వీరిద్దరూ చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ వీడియోను రెస్టారెంట్‌లోని వ్యక్తి ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
వైసీపీకి మరో షాక్! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!
మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!
ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: