రియల్‌మి సంస్థ తాజాగా భారత్ మార్కెట్‌లో రియల్‌మి P1 5G సిరీస్ (Realme P1 5G Series Smartphones) స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో రియల్‌మి P1 5G, P1 ప్రో 5G హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి దీంతోపాటు రియల్‌మి ప్యాడ్ 2 మరియు T110 ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ను తక్కువ ధరకే మెరుగైన ఫీచర్లతో లాంచ్ చేసింది. రియల్‌మి P1 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2400 పిక్సల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటాయి. 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది.
ఇంకా చదవండి: 6.72 అంగుళాల డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ Vivo స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఖరారు.. అతి తక్కువ ధరకే! ఎందుకు ఆలస్యం చూసేయండి!
ఈ డిస్‌ప్లే మెరుగైన విజువల్ అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది. ఈ రియల్‌మి P1 5G హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్ 3D VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. 4356.52mm స్టెయిన్‌లెస్ వేపర్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఫలితంగా గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయాల్లో హ్యాండ్‌సెట్ వేడెక్కకుండా ఉండేలా ఈ ఫీచర్ పనిచేస్తుంది. రియల్‌మి P1 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT600 కెమెరాను కలిగి ఉంది. మరియు 2MP లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది. 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది. అదే 8GB ర్యామ్ 18,999 గా ఉంది. ఈ ఫోన్‌ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకొంటే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఎర్లీ బర్డ్ సేల్ జరగనుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..
అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: