చైనాలో కొత్త రకం రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. అయితే ఇలాంటి రైళ్లు ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా హైస్పీడ్ రైళ్లను చైనా ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయింది. అయితే ఈ రైళ్లు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా విమానం గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే.. ఈ రైళ్లు మాత్రం 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం విశేషం. ఈ రైళ్లు మాగ్లెవ్ ట్రైన్ నెట్‌వర్క్ సాయంతో ప్రయాణిస్తాయి. వీటని టీ-ఫ్లైట్స్‌గా చైనా అధికారులు పిలుస్తున్నారు. ఇక ఈ రైళ్లు సాధారణ రైళ్లు ప్రయాణించినట్లు పట్టాలపై చక్రాలతో పరిగెత్తలేవని చెబుతున్నారు.
అసలేంటీ మాగ్లెవ్ ట్రైన్ నెట్‌వర్క్?
సాధారణంగా రైళ్ల వేగం రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. రైలు పట్టాలు-రైలు చక్రాల మధ్య ఉండే ఘర్షణ ఒకటి అయితే.. ప్రయాణంలో రైలుకు ఎదురుగా వచ్చే గాలి రెండోది. ఈ రెండింటికీ చెక్ పెడుతూ రైలు వేగాన్ని ఒక్కసారిగా పెంచే సరికొత్త నెట్‌వర్క్ ఈ మాగ్లెవ్ ట్రైన్ నెట్‌వర్క్ అని చైనా అధికారులు పేర్కొంటున్నారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?
రైళ్లకు అంత వేగం ఎలా సాధ్యం?
మాగ్లెవ్ ట్రైన్ నెట్‌వర్క్ విధానంలో ఈ టీ-ఫ్లైట్స్ రైలు ఒక టన్నెల్ లాంటి హైపర్‌లూప్ నిర్మాణం గుండా ప్రయాణిస్తూ ఉంటుంది. దీని వల్ల గాలి నుంచి వచ్చే నిరోధకత తగ్గుతుందని రైల్వే నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ మాగ్లెవ్ ట్రైన్ నెట్‌వర్క్ విధానంలో ప్రయాణించే రైళ్లకు చక్రాలు ఉండవు. అయితే ఆ రైలు పట్టాలపై అయస్కాంతాలు ఉంటాయి. అదే సమయంలో రైలు కింద ఉన్న ప్రత్యేక అయస్కాంతాలు.. పట్టాలపై ఉండే అయస్కాంతాలతో వికర్షణ ఏర్పడి రైలు అతి వేగాన్ని అందుకుంటుందని చెప్పారు.
ఇక షాంఘై మాగ్లెవ్‌లో ఒక్కో రైలు గంటకు 431 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చాంగ్‌షా మాగ్లెవ్‌లో ఒక్కో రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అయితే త్వరలో నిర్మించనున్న కొత్త మాగ్లెవ్ ట్రైన్ నెట్‌వర్క్‌లో రైలు వేగాన్ని గంటకు 1000 కిలోమీటర్లు దాటించాలని చైనా ఇంజినీర్లు అనేక కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ మాగ్లెవ్ ట్రైన్ నెట్‌వర్క్ నిర్మాణాలు ప్రారంభమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss
ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..
ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!
మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!
ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!
చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: