ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదిలిపెట్టడం లేదు. చలి తీవ్రత పెరుగుతున్న నవంబర్ నెలలోనూ ఏపీని వాన వెంటాడుతూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఈ నెల 27, 28, 29 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తూర్పు హిందూ మహాసముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాల పైన నవంబర్ 25వ తేదీన వాయుగుండం గా బలపడేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు.
దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక వర్షాలు కురిసేందుకు రెండు రోజుల సమయం ఉన్నందున ముఖ్యంగా రైతులు వరి కోతకు వచ్చిన సమయంలో ధాన్యం తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు అన్నారు. ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అది వాయువ్యదిశగా కదులుతూ ఆ తర్వాత రెండు రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే ఛాన్స్ ఉన్నదని రోణంకి కూర్మనాధ్ తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురవగా మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ఇంకా చదవండి: 25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!
వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!
వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!
ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!
కమెడియన్ అలీకి ఊహించని షాక్! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్యదర్శి - ఎందుకు అంటే!
జగన్ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
వైసీపీకి మరో షాక్! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!
మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!
ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: