తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.! Labubu: ది మాన్స్టర్స్ సిరీస్‌లో భాగమైన లబుబు.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షనర్స్‌ క్రేజ్‌! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.! Labubu: ది మాన్స్టర్స్ సిరీస్‌లో భాగమైన లబుబు.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షనర్స్‌ క్రేజ్‌!

Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!

2025-11-06 14:32:00

రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి తానేటి  అనిత  మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేటి యువతే రేపటి ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు. అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువత రక్షణ, భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు” అని తెలిపారు.

డ్రగ్స్‌ సమస్యపై ప్రభుత్వం సున్నా సహనం విధానాన్ని అవలంబించిందని ఆమె చెప్పారు. ఈగల్‌ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సాగును దాదాపు జీరో స్థాయికి తగ్గించామని వివరించారు. “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదాన్ని పాఠశాల స్థాయికి తీసుకెళ్లి, 50 వేల స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

“ఒక తల్లి తన కుమార్తెను రక్షించండి అని వేడుకున్న సందర్భం నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ ఘటన తర్వాతే డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి పూర్తిగా తుడిచిపెట్టాలని సంకల్పించాం,” అని అనిత గారు చెప్పారు.

వైసీపీ పాలనలో డ్రగ్స్‌ దందా విస్తరించిందని ఆమె తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం యువతకు చెడు అలవాట్లు దూరం చేయాలని ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటుంటే, వైసీపీ మాత్రం ‘డ్రగ్స్ తీసుకో బ్రో’ అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. జగన్‌మోహన్ రెడ్డి పాలనలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ ను గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది, అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌కే దారి తీసేవని అనిత గారు తెలిపారు. “జగన్ ఐదేళ్ల పాలనలో డ్రగ్స్‌పై ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం మా ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసి, ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌, రైల్వే పోలీస్‌లతో సమన్వయంగా పనిచేస్తోంది” అని వివరించారు.

యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం డ్రగ్స్‌ వ్యసనాన్ని పూర్తిగా అంతమొందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి అనిత  స్పష్టం చేశారు.

Spotlight

Read More →