Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా! Chandrababu: మహానాడులో చంద్రబాబు రౌండ్ టేబుల్ వార్నింగ్.. "గొడ్డలి పార్టీకి నెవర్ అగైన్.. ఇగోలు వీడి కూటమితో కలిసి సాగండి!" Nara Lokesh: టీమ్ 11 కెప్టెన్‌కు లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్ - ‘డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చెయ్... తేల్చుకుందాం! Nara Lokesh: చెప్పినట్టే 'భారీ ప్రకటన' చేసిన నారా లోకేశ్.. దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారిన టీడీపీ నిర్ణయం! Nara Lokesh: మహిళల్లో కొత్త ఆశలు నింపిన లోకేష్ నిర్ణయం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు! NASA: చంద్రుడిపై ఇల్లు కట్టనున్న మానవుడు.. 2030 నాటికి నాసా శాశ్వత స్థావరం! Art Of Living: ఘనంగా ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45 ఏళ్ల వేడుకలు... తరలివచ్చిన దేశ విదేశీ ప్రముఖులు! Central Govt: జనాభా మార్పుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ! కేంద్రం కీలక నిర్ణయం! Chandrababu: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాం": మహానాడు ముగింపు వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! chandrababu: వాహనాల హోరు తగ్గింది.. తమ్ముళ్ల జోరు తగ్గలేదు.. సరికొత్త హైబ్రిడ్ మహానాడుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా! Chandrababu: మహానాడులో చంద్రబాబు రౌండ్ టేబుల్ వార్నింగ్.. "గొడ్డలి పార్టీకి నెవర్ అగైన్.. ఇగోలు వీడి కూటమితో కలిసి సాగండి!" Nara Lokesh: టీమ్ 11 కెప్టెన్‌కు లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్ - ‘డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చెయ్... తేల్చుకుందాం! Nara Lokesh: చెప్పినట్టే 'భారీ ప్రకటన' చేసిన నారా లోకేశ్.. దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారిన టీడీపీ నిర్ణయం! Nara Lokesh: మహిళల్లో కొత్త ఆశలు నింపిన లోకేష్ నిర్ణయం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు! NASA: చంద్రుడిపై ఇల్లు కట్టనున్న మానవుడు.. 2030 నాటికి నాసా శాశ్వత స్థావరం! Art Of Living: ఘనంగా ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45 ఏళ్ల వేడుకలు... తరలివచ్చిన దేశ విదేశీ ప్రముఖులు! Central Govt: జనాభా మార్పుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ! కేంద్రం కీలక నిర్ణయం! Chandrababu: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాం": మహానాడు ముగింపు వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! chandrababu: వాహనాల హోరు తగ్గింది.. తమ్ముళ్ల జోరు తగ్గలేదు.. సరికొత్త హైబ్రిడ్ మహానాడుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

Nara Lokesh: మహిళల్లో కొత్త ఆశలు నింపిన లోకేష్ నిర్ణయం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు!

Nara Lokesh: మహిళల రాజకీయ సాధికారతకు తెలుగుదేశం పార్టీ మరో కీలక అడుగు వేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

Published : 2026-05-27 14:10:00

మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌పై టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం..

మహిళా సాధికారతకు లోకేష్ భారీ ముందడుగు..

అమరావతి: మహిళల రాజకీయ సాధికారతకు తెలుగుదేశం పార్టీ మరో కీలక అడుగు వేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడులో మంత్రి నారా లోకేష్ మహిళలకు పార్టీ పదవులు, అవకాశాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం మహిళల్లో కొత్త ఆశలు నింపిందన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… మహిళల అభివృద్ధి గురించి చాలామంది నాయకులు మాట్లాడతారని, కానీ ఆచరణలో ఇలాంటి ధైర్యమైన నిర్ణయం తీసుకునే నాయకత్వం చాలా అరుదుగా కనిపిస్తుందని అన్నారు. మహిళలకు సమాన రాజకీయ అవకాశాలు కల్పించాలనే నిజమైన సంకల్పం మంత్రి లోకేష్‌లో ఉందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఎదుర్కొన్న అడ్డంకులను ప్రస్తావిస్తూ… బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా తెలుగుదేశం పార్టీలో మాత్రం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని లోకేష్ ప్రకటించడం గొప్ప విషయం అని కొనియాడారు.

మహిళల పట్ల గౌరవం, వారికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలనే ఆలోచన ఈ నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నాయకుడు అంటే కేవలం పదవిలో ఉండటం కాదని… సమాజానికి దిశా నిర్దేశం చేసే వ్యక్తి కావాలని, ఆ లక్షణాలు మంత్రి లోకేష్‌లో కనిపిస్తున్నాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

మహిళల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. యువ నాయకత్వం అంటే ఏమిటో, మహిళల పట్ల నిబద్ధత ఎలా ఉండాలో దేశానికి ఆదర్శంగా నిలిచేలా మంత్రి లోకేష్ ముందుకు సాగుతున్నారని అన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉందని గుర్తు చేసిన మంత్రి ఇప్పుడు లోకేష్ నాయకత్వంలో ఆ సంకల్పం మరింత బలపడిందన్నారు. భవిష్యత్తులో మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా ఇది ఒక గొప్ప ముందడుగు అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Spotlight

Read More →