Indian Railways: విశాఖపట్నం - కొల్లం ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ విడుదల.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే? Toyota Fortuner: ఫార్చ్యూనర్ ప్రియులకు షాక్... రూ. 70 వేల వరకు పెరిగిన ఫార్చ్యూనర్ ధర!! Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధిలో నౌకాదళ రక్షణ నిలిపివేత! Prakash Raj: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు! Kamal Haasan: విజయ్‌ను సీఎం కాకుండా అడ్డుకోవడం అంటే ప్రజా తీర్పుని అగౌరవ పర్చడమే.. కమల్ హాసన్ నిప్పులు! Mango: డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండును ఎలా తినాలో తెలుసా? అపోహలు వీడి నిజాలు తెలుసుకోండి! TFAS: అమెరికాలో ప్రవాస భారతీయుడికి ఘన సత్కారం! TFAS ఉగాది వేడుకలు! Rajinikanth: ఆయన ఆఖరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు.. సూపర్ స్టార్ రజనీకాంత్ భావోద్వేగం! Rain Alert: వాతావరణ శాఖ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు! మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి! Chandrababu: కేంద్ర నిధుల మళ్లింపు, రూ. 1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు.. రాష్ట్ర ఆర్థిక సవాళ్లపై సీఎం సమీక్ష! Indian Railways: విశాఖపట్నం - కొల్లం ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ విడుదల.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే? Toyota Fortuner: ఫార్చ్యూనర్ ప్రియులకు షాక్... రూ. 70 వేల వరకు పెరిగిన ఫార్చ్యూనర్ ధర!! Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధిలో నౌకాదళ రక్షణ నిలిపివేత! Prakash Raj: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు! Kamal Haasan: విజయ్‌ను సీఎం కాకుండా అడ్డుకోవడం అంటే ప్రజా తీర్పుని అగౌరవ పర్చడమే.. కమల్ హాసన్ నిప్పులు! Mango: డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండును ఎలా తినాలో తెలుసా? అపోహలు వీడి నిజాలు తెలుసుకోండి! TFAS: అమెరికాలో ప్రవాస భారతీయుడికి ఘన సత్కారం! TFAS ఉగాది వేడుకలు! Rajinikanth: ఆయన ఆఖరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు.. సూపర్ స్టార్ రజనీకాంత్ భావోద్వేగం! Rain Alert: వాతావరణ శాఖ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు! మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి! Chandrababu: కేంద్ర నిధుల మళ్లింపు, రూ. 1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు.. రాష్ట్ర ఆర్థిక సవాళ్లపై సీఎం సమీక్ష!

Chandrababu: జిల్లాల వారీ సమీక్షలు పూర్తి చేసిన సీఎం చంద్రబాబు.. అభివృద్ధి పనులపై స్పష్టమైన దిశానిర్దేశం!

Chandrababu: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడు నెలలుగా నిర్వహించిన జిల్లాల వారీ సమీక్షలను పూర్తి చేశారు.

Published : 2026-05-07 10:09:00

3 నెలల్లో 28 జిల్లాల ప్రతినిధులతో సమీక్షలు చేపట్టిన సీఎం చంద్రబాబు..

జిల్లాలవారీగా ప్రజాప్రతినిధులు, ఇన్ ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష..

అమరావతి: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడు నెలలుగా నిర్వహించిన జిల్లాల వారీ సమీక్షలను పూర్తి చేశారు. ఫిబ్రవరి 12న కృష్ణా జిల్లాతో ప్రారంభమైన ఈ సమీక్షల పరంపర తాజాగా విశాఖపట్నం జిల్లాతో ముగిసింది. మొత్తం 28 జిల్లాల ప్రజాప్రతినిధులు, ఇన్‌ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం విస్తృతంగా చర్చలు జరిపారు.

ఈ సమీక్షల్లో ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, అభివృద్ధి అవసరాలు, ప్రజల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం వెయ్యికి పైగా సమస్యలు వివిధ జిల్లాల నుంచి ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వాటిలో అత్యవసరమైన అంశాలపై అక్కడికక్కడే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఆర్థిక వ్యయం అవసరం లేని పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సమన్వయం చేసి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సమీక్షల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై కూడా సీఎం చంద్రబాబు నివేదికలు స్వీకరించినట్లు సమాచారం. ప్రజలతో మమేకమై పనిచేయాలని, పనితీరు సరిగా లేని ప్రజాప్రతినిధులు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. ప్రజల్లో వివాదాలకు దారి తీసే అంశాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది.

కూటమి ప్రభుత్వంలో భాగమైన పార్టీల మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు సూచించే స్థానిక సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఇక అధికారుల పనితీరుపైనా సీఎం సూక్ష్మస్థాయిలో సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రజలకు వేగంగా సేవలు అందించే విధంగా పాలన ఉండాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని సూచించారు. ఈ జిల్లాల వారీ సమీక్షలు ప్రభుత్వ పనితీరుకు కొత్త దిశానిర్దేశం చేసినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Spotlight

Read More →