సాయి ధరమ్ తేజ్ గతంలో విరూపాక్ష’తో మంచి హిట్ కొట్టినా, ఆ తర్వాత వచ్చిన ‘బ్రో’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే గాంజా శంకర్ అనే సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో కొంత నిరాశ వచ్చింది. అయితే ఇప్పుడు సంబరాల ఏటిగట్టు గ్లింప్స్ చూసిన అభిమానులు ఇది తేజ్ కెరీర్లో మరో టర్నింగ్ పాయింట్ అవుతుందేమో అంటున్నారు.
తేజ్ హీరోగా నటిస్తున్న సంబరాల ఏటిగట్టు (SYG) సినిమా నుంచి తాజాగా ఒక గ్లింప్స్ వీడియో విడుదలైంది. ఈ వీడియోను తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ గ్లింప్స్ చూస్తే సినిమాలో యాక్షన్, మాస్, ఎమోషన్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ ప్యాకేజ్‌గా కనిపిస్తోంది. అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం అంటూ తేజ్ చెప్పే డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తోంది.
ఈ సినిమాలో తేజ్ లుక్ చాలా స్టైలిష్‌గా, మాస్‌గా ఉంది. ఆయన కత్తి పట్టి చేసే యాక్షన్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా, జగపతి బాబు, సాయి కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా అజనీష్ లోకనాథ్ పనిచేస్తున్నారు.
యాక్షన్, ఎమోషన్ కలిపిన ఈ సినిమా గ్లింప్స్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సాయి తేజ్‌కి నెక్స్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుంది తేజ్ మాస్లో సూపర్‌గా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తేజ్ 8 ప్యాక్‌తో కనిపించిన పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమా ప్రజల అణచివేతకు వ్యతిరేకంగా హీరో చేసే పోరాటం ప్రధాన కథాంశంగా ఉంటుంది. తేజ్ పాత్రలో ఉన్న ఆగ్రహం, భావోద్వేగం, డైలాగ్ డెలివరీ చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ చిత్రంతో తేజ్ కెరియర్ ఫ్యాన్ ఇండియా రేంజ్ కి వెళ్లాలని అభిమానులుగా ఆశిద్దాం.