Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి! Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్! No Salt Diet: ఇది మీకు తెలుసా! ఉప్పు అసలు తినకపోయినా యమ డేంజర్! Morning Habits: ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా చేయాల్సిన పనులు! చాలా మందికి తెలియదు! Brain Stroke: పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం! ఎవరికి ఎక్కువగా వస్తుందో తెలుసా! Healthy Food: మూత్రం పోస్తుంటే మంటగా ఉందా.. ఈ వెజిటెబుల్‌ తింటే సమస్య ఇట్టే మాయం! డయాబెటిస్ కి కూడా.. NTR Medical Services: సమ్మె విరమణ! ఎన్టీఆర్ వైద్య సేవలు పునః ప్రారంభం! Reduce Hip Fat Tips: హిప్ ఫ్యాట్ తగ్గించుకోవడం ఎలా? నిపుణుల సూచనలు, చిన్న మార్పులతో పెద్ద ఫలితం! Drinking Water: ఈ ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే నీళ్లు తాగుతున్నారా! అయితే జాగ్రత్త... Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి! Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్! No Salt Diet: ఇది మీకు తెలుసా! ఉప్పు అసలు తినకపోయినా యమ డేంజర్! Morning Habits: ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా చేయాల్సిన పనులు! చాలా మందికి తెలియదు! Brain Stroke: పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం! ఎవరికి ఎక్కువగా వస్తుందో తెలుసా! Healthy Food: మూత్రం పోస్తుంటే మంటగా ఉందా.. ఈ వెజిటెబుల్‌ తింటే సమస్య ఇట్టే మాయం! డయాబెటిస్ కి కూడా.. NTR Medical Services: సమ్మె విరమణ! ఎన్టీఆర్ వైద్య సేవలు పునః ప్రారంభం! Reduce Hip Fat Tips: హిప్ ఫ్యాట్ తగ్గించుకోవడం ఎలా? నిపుణుల సూచనలు, చిన్న మార్పులతో పెద్ద ఫలితం! Drinking Water: ఈ ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే నీళ్లు తాగుతున్నారా! అయితే జాగ్రత్త...

Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి!

2025-11-05 08:50:00

ఇప్పటి యువత అంటే జెన్‌ జె (Gen Z) టెక్నాలజీతో పెరిగిన ఈ తరం ప్రతి పనిలోనూ పారదర్శకత, సులభత, డిజిటల్‌ సౌకర్యాలను కోరుకుంటుంది. అదే ధోరణి ఇప్పుడు విద్యా రుణాలో విషయంలో కూడా కనిపిస్తోంది. పాత తరాల వలె కాకుండా వీరు రుణం తీసుకోవడంలోనూ, తిరిగి చెల్లించడంలోనూ పూర్తిగా కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు.

జెన్‌ జె విద్యార్థులు ఏ బ్యాంక్‌ నుంచి లేదా ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ నుంచి రుణం తీసుకోవాలన్నా ముందుగా అన్ని షరతులను, వడ్డీ రేట్లను, రీపేమెంట్‌ ఆప్షన్‌లను జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఏమీ దాచకుండా చెప్పాలి అనే పారదర్శకతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇది వాళ్లలో ఉన్న ఆర్థిక అవగాహన పెరిగిన సంకేతం.

ఇప్పటి యువతకు అన్ని సేవలు మొబైల్‌ యాప్‌ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి. బ్యాంక్‌ బ్రాంచ్‌కి వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడటమంటే వీరికి ఇష్టం ఉండదు. చాలా మంది విద్యార్థులు ఇప్పుడు రుణాలు తీసుకోవడానికి ఫిన్టెక్‌ ప్లాట్‌ఫారమ్‌లు లేదా డిజిటల్‌ లోన్‌ యాప్స్‌ వాడుతున్నారు. వాటిలో డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయడం, వడ్డీ లెక్కించడం, ఎమీఐ (EMI) షెడ్యూల్‌ చెక్‌ చేయడం అన్నీ సులభంగా చేయగలరు.

జెన్‌ జె తరం చిన్న వయసులోనే ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ నేర్చుకుంటోంది. యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ద్వారా లోన్‌ ఎలా తీసుకోవాలి? వడ్డీ రేటు ఎలా లెక్కించాలి? రుణం చెల్లించడంలో ఏవి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు తెలుసుకుంటున్నారు. అందుకే, ఎవరైనా రుణం ఇవ్వాలంటే కేవలం పేరు మీద నమ్మకం కాదు, స్పష్టమైన డేటా, క్లియర్‌ టర్మ్స్‌ కావాలి అని వీరు డిమాండ్‌ చేస్తున్నారు.

మునుపటి తరాలు రుణం తీసుకున్న తర్వాత ఎక్కువ ఒత్తిడిలో ఉండేవారు. కానీ జెన్‌ జె మాత్రం రుణం తీసుకునే ముందు నుంచే రీపేమెంట్‌ ప్లాన్‌ సెట్‌ చేసుకుంటుంది. తమ భవిష్యత్‌ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంత కాలంలో చెల్లించగలమో అంచనా వేస్తారు. కొందరు అయితే ‘ఇన్‌కమ్‌ బేస్డ్‌ రీపేమెంట్‌’ (Income-Based Repayment) మోడల్‌ వైపే మొగ్గు చూపుతున్నారు — అంటే ఆదాయం పెరిగినప్పుడు కొంచెం ఎక్కువ చెల్లించడం, తగ్గినప్పుడు తక్కువ చెల్లించడం.

జెన్‌ జె అవసరాలకు తగ్గట్టు ఇప్పుడు చాలా బ్యాంకులు కూడా తమ సేవలను మార్చుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ లోన్‌ కాలిక్యులేటర్లు, కస్టమ్‌ ప్లాన్లు, తక్కువ వడ్డీతో స్టూడెంట్‌ స్పెషల్‌ ఆఫర్లు అందిస్తున్నారు. విద్యార్థులు కూడా క్రెడిట్‌ స్కోర్‌ అంటే ఏమిటో తెలుసుకుని, భవిష్యత్తులో మంచి రికార్డు కోసం రుణాలను సమయానికి చెల్లిస్తున్నారు.

జెన్‌ జె తరం విద్యతో పాటు ఆర్థిక అవగాహనను కూడా సమానంగా పెంచుకుంటోంది. ఎంత చదవాలి? అన్నదే కాదు, ఎంత ఖర్చవుతుంది, దాన్ని ఎలా నిర్వర్తించాలి? అన్నది కూడా వారు ముందుగానే అంచనా వేస్తున్నారు. రుణం అంటే భారం కాదు ఒక అవకాశం అని వీరు భావిస్తున్నారు.

Spotlight

Read More →