పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... WhatsApp Update: ముప్పు పొంచి ఉంది.. జాగ్రత్త! కేవలం 5 నిమిషాల్లో మీ వాట్సాప్ అకౌంట్‌ను 100% సేఫ్ గా మార్చుకోండి! లేదంటే.. Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం! AP Budget 2026: 16వ ఆర్థిక సంఘం నిధుల్లో వాటా పెంపు.. ఏకంగా రూ. 64,362 కోట్లు కేటాయింపు! Gold & Silver Prices: పసిడి ప్రియులకు పండగే.. ఆకాశం నుంచి నేలకొరిగిన ధరలు.. తులం బంగారంపై - వారికి షాక్.. వందే భారత్ కాదు… ఇది అసలైన హైస్పీడ్ రైల్! తెలుగు రాష్ట్రాల గేమ్ ఛేంజర్! టాలీవుడ్ సెన్సేషన్... ఒకే తెరపై అన్నదమ్ములుగా బాలయ్య, మహేష్ బాబు! మధుమేహానికి మందులా పనిచేసే స్పెషల్ పచ్చడి! ఒకసారి ట్రై చెయ్యండి! వేల ఏళ్ల నాటి ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్న పండ్లు! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... WhatsApp Update: ముప్పు పొంచి ఉంది.. జాగ్రత్త! కేవలం 5 నిమిషాల్లో మీ వాట్సాప్ అకౌంట్‌ను 100% సేఫ్ గా మార్చుకోండి! లేదంటే.. Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం! AP Budget 2026: 16వ ఆర్థిక సంఘం నిధుల్లో వాటా పెంపు.. ఏకంగా రూ. 64,362 కోట్లు కేటాయింపు! Gold & Silver Prices: పసిడి ప్రియులకు పండగే.. ఆకాశం నుంచి నేలకొరిగిన ధరలు.. తులం బంగారంపై - వారికి షాక్.. వందే భారత్ కాదు… ఇది అసలైన హైస్పీడ్ రైల్! తెలుగు రాష్ట్రాల గేమ్ ఛేంజర్! టాలీవుడ్ సెన్సేషన్... ఒకే తెరపై అన్నదమ్ములుగా బాలయ్య, మహేష్ బాబు! మధుమేహానికి మందులా పనిచేసే స్పెషల్ పచ్చడి! ఒకసారి ట్రై చెయ్యండి! వేల ఏళ్ల నాటి ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్న పండ్లు!

Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!!

ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. జల్ జీవన్ మిషన్ గడువును 2028 వరకు పొడిగించడంతో, రూ. 27 వేల కోట్ల విలువైన పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.

Published : 2026-02-02 12:04:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 'జల్ జీవన్ మిషన్' (JJM) పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం గడువును 2028 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం ఏపీలోని కూటమి ప్రభుత్వానికి పెద్ద ఊరటనివ్వడమే కాకుండా, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల తాగునీటి ప్రాజెక్టులకు పునర్జీవం పోసినట్లయింది.

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలు తీవ్ర కుంటుపడింది. గత ప్రభుత్వం తన వంతు వాటా నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో, కేంద్రం మంజూరు చేసిన రూ. 27,000 కోట్ల విలువైన పనుల్లో కేవలం రూ. 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. నిధుల కొరత కారణంగా జలాశయాల నుంచి పైపులైన్ల నిర్మాణం, శుద్ధి కేంద్రాల ఏర్పాటు వంటి కీలక పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్ల లక్ష్యం నెరవేరలేదు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం, ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం భూగర్భ జలాలపై (బోర్లు) ఆధారపడకుండా, నదులు మరియు ప్రధాన జలాశయాల నుంచి ఉపరితల జలాలను సేకరించి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ. 84,500 కోట్లతో సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను (DPR) సిద్ధం చేసి కేంద్ర ఆమోదం కోసం పంపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో పాత ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి సమయం అవసరమని గుర్తించిన ముఖ్యమంత్రి, గడువు పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. కేంద్రం సానుకూలంగా స్పందించి 2028 వరకు గడువు ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ఉత్సాహం నెలకొంది. రూ. 23 వేల కోట్ల పనులకు మోక్షం గడువు పొడిగింపుతో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 23,000 కోట్ల విలువైన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ

కేంద్ర వాటా: 50 శాతం నిధులను (రూ. 13,500 కోట్లు) కేంద్రం నుంచి రాబట్టేందుకు మార్గం సుగమమైంది.

రాష్ట్ర వాటా: ప్రభుత్వం తన వంతు నిధుల కోసం జాతీయ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు (NaBFID) నుంచి రూ. 10,000 కోట్ల రుణాన్ని సమీకరిస్తోంది.

అదనపు నిధులు: మరో రూ. 3,000 కోట్లను బడ్జెట్ ద్వారా కేటాయించి, మొత్తం రూ. 13,000 కోట్లతో పనులను పరుగులు పెట్టించాలని భావిస్తోంది.

2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి పల్లెలో, ప్రతి గడపకూ కుళాయి కనెక్షన్ ఇవ్వడమే కాకుండా, వేసవిలో కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. జల్ జీవన్ మిషన్ గడువు పెరగడం వల్ల అటు కాంట్రాక్టర్లకు బకాయిల చెల్లింపులు, ఇటు కొత్త పనుల టెండర్ల ప్రక్రియ వేగవంతం కానుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముఖ్యంగా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో మైలురాయిగా నిలవనుంది.

Spotlight

Read More →