అమెరికాలో (America) హెచ్-1బీ వీసా (H-1B Visa) కోసం ఎదురుచూసే సాంకేతిక నిపుణులకు (Technical experts) కెనడా (Canada) ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలోనే, ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కెనడా ప్రభుత్వం ఒక తెలివైన వ్యూహం (Clever strategy) రచిస్తోంది.
యునైటెడ్ స్టేట్స్ నుంచి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది టాప్ పరిశోధకులు మరియు హెచ్-1బీ వీసా హోల్డర్లను తమ దేశం వైపు ఆకర్షించడమే. ఇందుకోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలను సృష్టిస్తోంది.
ఈ విధానం వల్ల ఉన్నత నైపుణ్యం (High skill) ఉన్న కార్మికుల కొరత తీరడమే కాకుండా, కెనడా ఆర్థిక వ్యవస్థకు (Economic system) కూడా పెద్ద బలం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కెనడా ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేధావులను, ప్రతిభావంతులను ఆకర్షించడానికే తమ మొదటి బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.
నైపుణ్యం (Skill) కలిగిన 1,000 మందికి పైగా నిపుణులను నియమించుకోవడానికి ఏకంగా రూ. 106 కోట్లకు పైనే బడ్జెట్‌లో కేటాయించింది. రాబోయే నెలల్లో హెచ్-1బీ వీసా హోల్డర్ల కోసం ఒక 'వేగవంతమైన మార్గం'ను ప్రారంభించాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ నిర్ణయం వల్ల యూఎస్ (US) లోని టెక్ కంపెనీలలో పనిచేస్తూ, వీసా రెన్యూవల్ లేదా శాశ్వత నివాసం కోసం సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయ నిపుణులకు పెద్ద అవకాశం లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఒకవైపు నైపుణ్యం ఉన్న కార్మికులను ఆకర్షిస్తూనే, మరోవైపు భారతీయ విద్యార్థులతో సహా విదేశీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుండి భారతీయులు సహా విదేశీ విద్యార్థుల ప్రవేశాలను 25-32 శాతం తగ్గించాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది.
కొత్త వలస ప్రణాళిక ప్రకారం, కెనడా దేశంలోకి వచ్చే తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించి, అధిక నైపుణ్యం కలిగిన కార్మికుల ప్రవేశాలను మాత్రం కొనసాగించాలని అక్కడ ప్రభుత్వం యోచిస్తోంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, 2026 నుండి 2028 వరకు ఏడాదికి 3,80,000 మందికి శాశ్వత నివాసితుల సంఖ్యను తీసుకురావాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ చర్య విదేశీ విద్యార్థులకు నిరాశను కలిగించినా, ఉన్నత నైపుణ్యం కలిగిన నిపుణులకు మాత్రం కెనడా బంగారు అవకాశం కల్పిస్తోందని చెప్పవచ్చు.