Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! LPG New Rules: గ్యాస్ వినియోగదారులకు షాక్: జూన్ 30 లోగా ఆ పని చేయకపోతే కనెక్షన్ కట్! Immigration: విదేశీయుల నమోదు ప్రక్రియలో కీలక మార్పులు.. కొత్త నిబంధనలు విడుదల చేసిన కేంద్రం! Mahanadu: మాల్టాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. మహానాడు వేడుకలు! USA UPdates: భారత టెక్ నిపుణులకు ఎన్విడియా బంపర్ ఆఫర్.. సిలికాన్ వ్యాలీ లేఆఫ్స్ వేళ భారీ జీతాలతో రిక్రూట్మెంట్! Priyanka: కొరియా అధ్యక్షుడి ప్రశంసలే మైలురాయి.. ప్రియాంక అరుళ్ మోహన్ సరికొత్త రికార్డు! Gun Shooting: అమెరికాలో కాల్పుల కలకలం... ఏడుగురు మృతి! Rains: దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక.. ఐఎమ్‌డీ అలర్ట్! Sweetest Mango: టెంక చాలా పల్చగా.. రసం చాలా ఎక్కువగా.. ప్రపంచంలోనే అత్యంత తియ్యని మామిడి పండు ఇదే.! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! LPG New Rules: గ్యాస్ వినియోగదారులకు షాక్: జూన్ 30 లోగా ఆ పని చేయకపోతే కనెక్షన్ కట్! Immigration: విదేశీయుల నమోదు ప్రక్రియలో కీలక మార్పులు.. కొత్త నిబంధనలు విడుదల చేసిన కేంద్రం! Mahanadu: మాల్టాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. మహానాడు వేడుకలు! USA UPdates: భారత టెక్ నిపుణులకు ఎన్విడియా బంపర్ ఆఫర్.. సిలికాన్ వ్యాలీ లేఆఫ్స్ వేళ భారీ జీతాలతో రిక్రూట్మెంట్! Priyanka: కొరియా అధ్యక్షుడి ప్రశంసలే మైలురాయి.. ప్రియాంక అరుళ్ మోహన్ సరికొత్త రికార్డు! Gun Shooting: అమెరికాలో కాల్పుల కలకలం... ఏడుగురు మృతి! Rains: దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక.. ఐఎమ్‌డీ అలర్ట్! Sweetest Mango: టెంక చాలా పల్చగా.. రసం చాలా ఎక్కువగా.. ప్రపంచంలోనే అత్యంత తియ్యని మామిడి పండు ఇదే.! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

LPG New Rules: గ్యాస్ వినియోగదారులకు షాక్: జూన్ 30 లోగా ఆ పని చేయకపోతే కనెక్షన్ కట్!

LPG New Rules: కొత్త నిబంధనల ప్రకారం ఒకే ఇంట్లో ఉంటూ ఒకే వంటగదిని పంచుకునే కుటుంబానికి ఒకే ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ఒకే రేషన్ కార్డు లేదా ఒకే చిరునామాపై భార్యాభర్తలు, పిల్లలు లేదా తల్లిదండ్రుల పేర్ల మీద వేర్వేరుగా ఉన్న అదనపు కనెక్షన్లను వెంటనే తొలగించుకోవాలి.

Published : 2026-06-02 16:33:00

Busiess- ఎల్‌పీజీ సిలిండర్లపై కేంద్రం కొత్త రూల్స్.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్!

ఒకే ఇల్లు.. ఒకే గ్యాస్ కనెక్షన్.. నిబంధనలు మీరితే కనెక్షన్ రద్దు!

పైప్‌లైన్ గ్యాస్ వాడుతున్నారా? అయితే మీ సిలిండర్ వెంటనే ఇచ్చేయండి!

LPG New Rules: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఇండియన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కనెక్షన్లు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ నెలాఖరు లోగా అంటే జూన్ 30, 2026 నాటికి కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ గడువులోగా నిబంధనల ప్రకారం మార్పులు చేసుకోకపోతే గ్యాస్ కనెక్షన్లు శాశ్వతంగా రద్దవుతాయని అధికారులు స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా తలెత్తిన చమురు సంక్షోభం, గ్యాస్ కొరత కారణంగా ప్రభుత్వం సబ్సిడీలను నియంత్రించడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

కొత్త నిబంధనల ప్రకారం ఒకే ఇంట్లో ఉంటూ ఒకే వంటగదిని పంచుకునే కుటుంబానికి ఒకే ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ఒకే రేషన్ కార్డు లేదా ఒకే చిరునామాపై భార్యాభర్తలు, పిల్లలు లేదా తల్లిదండ్రుల పేర్ల మీద వేర్వేరుగా ఉన్న అదనపు కనెక్షన్లను వెంటనే తొలగించుకోవాలి. 'ఒకే ఇల్లు - ఒకే కనెక్షన్' విధానాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటే వాటిని స్వచ్ఛందంగా గ్యాస్ ఏజెన్సీకి అప్పగించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ఇప్పటికే పైప్‌లైన్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్ ఉన్నవారు తమ పాత ఎల్‌పీజీ సిలిండర్ కనెక్షన్‌ను ఉంచుకోవడానికి వీల్లేదు. నగరాల్లో చాలామంది పైపుల ద్వారా వచ్చే గ్యాస్ వాడుతూ కూడా పాత సిలిండర్లను అలాగే ఉంచుకుంటున్నారు. అలాంటి వారు జూన్ 30 లోగా తమ సిలిండర్ కనెక్షన్‌ను సరెండర్ చేయాల్సి ఉంటుంది. పైప్‌లైన్ మరియు సిలిండర్ రెండు కనెక్షన్లు కలిపి వాడుతున్నట్లు గుర్తిస్తే అధికారులు తక్షణమే గ్యాస్ సరఫరాను నిలిపివేస్తారు.

అయితే వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకే ఇంట్లో ఉన్న అదనపు సిలిండర్ కనెక్షన్లను స్వచ్ఛందంగా గ్యాస్ ఆఫీసులో అప్పగించిన వారికి ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పిస్తోంది. మీకున్న ఒకే ఒక అధికారిక కనెక్షన్‌ను 'డబుల్ సిలిండర్' (డీబీసీ) కనెక్షన్‌గా మార్చుకోవచ్చు. దీనివల్ల ఒక సిలిండర్ అయిపోగానే మరో సిలిండర్ వాడుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ రికార్డుల్లో మాత్రం కుటుంబానికి ఒకే కనెక్షన్ గుర్తింపు ఉంటుంది.

వినియోగదారులు ఈ ముప్పై రోజుల గడువును నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ గ్యాస్ డీలర్లను సంప్రదించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను ఆన్‌లైన్ ద్వారా సేకరిస్తున్న అధికారులు గడువు ముగిసిన వెంటనే కనెక్షన్లను రద్దు చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. కాబట్టి మీ ఇంట్లో అదనపు గ్యాస్ కనెక్షన్లు ఉన్నా లేదా పైప్‌లైన్ గ్యాస్ వాడుతున్నా వెంటనే సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి మీ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Spotlight

Read More →