భారీ కోడి పందెం.. ఈ ఏడాది అక్కడ ఇదే అతిపెద్ద పందెం..!

2026-01-16 19:45:00
Indians in Iran: ఇరాన్‌లో 10 వేల మంది భారతీయులు… అప్రమత్తమైన భారత్.. హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల!

ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కోనసీమ సంక్రాంతి సంబరాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందేలు. 

Railway News: రైల్వే టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధనలు – ఇకపై ఇవి తప్పనిసరి..!

ఈ సారి కూడా భారీ ఎత్తున కోడిపందేలు జరిగాయి. రెండు రోజుల్లోనే దాదాపు 20 కోట్ల మేర చేతులు మారాయి. పందెం రాయుళ్లు సమయం, జాతకం, ముహూర్తం చూసుకుని మరీ కోళ్లను బరిలోకి దింపుతున్నారు. ఇక, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జోరుగా కోడిపందేలు జరుగుతున్నాయి. నిన్న (గురువారం) పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. 

ఏపీకి కొత్త గుర్తింపు… రూ.13 వేల కోట్ల గ్రీన్ అమోనియా మెగా ప్రాజెక్ట్‌తో క్లీన్ ఎనర్జీలో రాష్ట్రం ముందడుగు!

ఓ వ్యక్తి కోడిపందెంలో ఏకంగా 1.53 కోట్ల రూపాయలు గెలిచాడు. రాజమండ్రి రమేష్ అనే వ్యక్తి ఈ రికార్డు సృష్టించాడు. గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేష్ కోళ్ల మధ్య భారీ పందెం జరిగింది. రాజమండ్రి రమేష్ కోడి ప్రభాకర్ కోడిని చిత్తుచిత్తుగా ఓడించింది. 

National Highway: ఆ ప్రాంతవాసుల నిరీక్షణకు బైబై… రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి కావడంతో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత విముక్తి.!!

దీంతో రమేష్ 1.53 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది ఇదే అతి పెద్ద పందెం అని స్థానికులు అంటున్నారు. ఇక, కోనసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సంక్రాంతి పండుగ సందర్బంగా కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది.

Pattadar Passbook: చంద్రబాబు కీలక ప్రకటన...! ప్రతి నెలా పట్టాదారు పుస్తకాల పంపిణీ !
Allu Arjuns pan India : తమిళనాడే నెక్స్ట్ టార్గెట్! అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్లాన్ రెడీ!
NH 65 traffic: హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ మళ్లింపులు! ఎక్కడెక్కడంటే?
Gold Mines: సౌదీ అరేబియా సంచలనం... బయటపడ్డ భారీ బంగారు నిధి! ఎంతంటే...
Healthy Diet: పెరుగు, గ్రీక్ యోగర్ట్, స్కైర్‌లో ఏదిలో ఎక్కువ ప్రోటీన్‌? మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్‌ అంటే...!!
పండగ వేళ బీఎస్‌ఎన్‌ఎల్‌ దిమ్మదిరిగే ఆఫర్‌.. 5000GB డేటా, OTT ప్రయోజనాలు - 20% డిస్కౌంట్!

Spotlight

Read More →