Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Kuwait: మాలేపాటి సురేష్ బాబు ఆధ్వర్యంలో వేడుకలు.. కువైట్ కృష్ణాస్ రెస్టారెంట్‌లో సందడిగా ఎన్ఆర్ఐ టీడీపీ ప్రోగ్రామ్.! Rupee vs Dollar: క్రూడాయిల్ సెగ.. రూపాయి విలవిల.. అంతర్జాతీయ అనిశ్చితితో కుదేలవుతున్న భారత కరెన్సీ.! Rain Alert: రాబోయే మూడు గంటల్లో ఈ నాలుగు జిల్లాలకు హై అలర్ట్!! పిడుగుల బీభత్సం.... 40-60కిమీ వేగంతో... Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Indian Stock Market: బ్లాక్ మండే.. మార్కెట్ విలవిల.. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఇన్వెస్టర్ల కొంపముంచిన పతనం. High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Kuwait: మాలేపాటి సురేష్ బాబు ఆధ్వర్యంలో వేడుకలు.. కువైట్ కృష్ణాస్ రెస్టారెంట్‌లో సందడిగా ఎన్ఆర్ఐ టీడీపీ ప్రోగ్రామ్.! Rupee vs Dollar: క్రూడాయిల్ సెగ.. రూపాయి విలవిల.. అంతర్జాతీయ అనిశ్చితితో కుదేలవుతున్న భారత కరెన్సీ.! Rain Alert: రాబోయే మూడు గంటల్లో ఈ నాలుగు జిల్లాలకు హై అలర్ట్!! పిడుగుల బీభత్సం.... 40-60కిమీ వేగంతో... Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Indian Stock Market: బ్లాక్ మండే.. మార్కెట్ విలవిల.. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఇన్వెస్టర్ల కొంపముంచిన పతనం. High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్!

Malta TDP 44th Anniversary: మాల్టా తీరాన మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. సీఎం చంద్రబాబు విజన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు!

TDP 44th Anniversary: మాల్టాలో ఎన్ఆర్ఐ-టిడిపి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందుచూపుతోనే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 టెక్నాలజీ రాష్ట్రంగా మారుతుందని లత, రవి సత్యనారాయణ రాజు సాగి మరియు ఇతర ప్రముఖులు ధీమా వ్యక్తం చేశారు.

Published : 2026-03-30 12:49:00

TDP 44th Anniversary: మధ్యధరా సముద్రం మధ్యలో ఉన్న ఒక అందమైన ద్వీప దేశం మాల్టా. యూరప్ ఖండంలో భాగమైన ఈ చిన్న దేశం తన చారిత్రక కట్టడాలు, అద్భుతమైన తీరప్రాంతం  ప్రశాంతమైన వాతావరణానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. వైవిధ్యమైన సంస్కృతులకు నిలయమైన మాల్టాలో ఇటీవల కాలంలో తెలుగు వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉపాధి, ఉన్నత చదువుల కోసం ఇక్కడికి వస్తున్న తెలుగు వారు తమ మూలాలను మర్చిపోకుండా, మన పండుగలను, రాజకీయ చైతన్యాన్ని అక్కడ కూడా చాటిచెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ-టిడిపి ఆధ్వర్యంలో మాల్టాలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక తెలుగు వారంతా ఒకచోట చేరి పార్టీ జెండాను ఎగురవేసి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తన కేడర్‌కు, సామాన్య కార్యకర్తకు ఇచ్చే ప్రాధాన్యతను కొనియాడారు. క్రమశిక్షణ, సేవా దృక్పథమే ఈ పార్టీ మూలస్తంభాలని వారు ఈ వేదికగా గుర్తుచేశారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైన విజన్ గురించి గర్వంగా చర్చించుకున్నారు. చంద్రబాబు గారు కేవలం వర్తమానం గురించి కాకుండా, రాబోయే 20 ఏళ్ల భవిష్యత్తును ముందుగానే ఊహించగల ధీశాలి అని లత గారు అభివర్ణించారు.  గతంలో ఆయన వేసిన ఐటీ పునాదుల వల్లే నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ఇప్పుడు మళ్ళీ ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక టెక్నాలజీ కలిగిన రాష్ట్రంగా ఎదుగుతుందని  సత్యనారాయణ రాజు సాగి గారు ఆశాభావం వ్యక్తం చేశారు.

మాల్టా వంటి సుదూర ప్రాంతంలో ఉంటూ కూడా మాతృభూమి పట్ల, తమ అభిమాన నాయకుడి పట్ల చూపుతున్న ఈ ప్రేమ అందరినీ ఆకట్టుకుంది. "తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగుదేశం ఉంటుంది" అనే నినాదాలతో మాల్టా లో మారుమోగాయి. అందరికీ విందు భోజనం ఏర్పాటు చేయడంతో వేడుకలు ఘనంగా ముగిశాయి.

Spotlight

Read More →