పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సత్యసాయి బాబా భౌతికంగా లేనప్పటికీ, ఆయన ప్రేమ, బోధనలు, ఆధ్యాత్మిక శక్తి ఇప్పటికీ కోట్లాది ప్రజలతోనే ఉన్నాయని అన్నారు.
సత్యసాయి బాబా విశ్వప్రేమకు ప్రతిరూపమని మోదీ చెప్పారు. ఆయన జీవితాంతం ప్రేమ, దయ, సేవ మాత్రమే చేశారు. భారతీయ సంస్కృతి సేవను అత్యున్నత ధర్మంగా భావిస్తుందని, భక్తి–జ్ఞానం–కర్మ అన్నీ సేవతో ముడిపడి ఉంటాయని చెప్పారు. “సేవే పరమధర్మం” అని మరోసారి గుర్తుచేశారు.
“అందరిని ప్రేమించు, అందరినీ సేవించు” అనే బాబా బోధనలు దేశమంతా కోట్ల మందిలో ప్రభావం చూపుతున్నాయని మోదీ తెలిపారు. అనేక భక్తులు బాబా చెప్పిన సేవా మార్గంలో నడుస్తూ మానవసేవ చేస్తున్నారు. బాబా బోధనల వల్ల చాలామంది ఆలోచన, జీవితం మారిపోయిందని చెప్పారు.
తాగునీరు, వైద్యం, విద్యవంటివి సహా అనేక రంగాల్లో సత్యసాయి బాబా చేసిన సేవలను మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. బాబా ప్రారంభించిన కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రజల కోసం బాబా చేసిన సేవలు భారతదేశానికి ఎంతో మేలు చేశాయని అన్నారు.
ఈరోజు 20,000 మంది బాలికలకు సురక్ష సమృద్ధి యోజన ప్రయోజనాలు అందించినట్లు మోదీ తెలిపారు. అలాగే గరీబ్ కల్యాణ్ యోజన ప్రయోజనాలు దేశంలో దాదాపు 100 కోట్ల మంది ప్రజలకు చేరినట్లు చెప్పారు. బాబా బోధనలు దేశాన్ని ముందుకు నడిపించే వెలుగుగా నిలుస్తాయని అన్నారు.