Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! Europe: డెన్మార్క్ వీధుల్లో భారత జెండాల రెపరెపలు.. అమరావతి బిల్లు ఆమోదంతో యూరోప్‌లో సంబరాలు.. US Iran War: చర్చల కోసం పాకిస్థాన్ బయల్దేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. మాతో ఆటలాడకండి - ఇరాన్‌కు వార్నింగ్ Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో.. Kanakaraju Movie: తమన్ మ్యూజిక్, మేర్లపాక కామెడీ.. ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ ప్రోమోతో అంచనాలు రెట్టింపు! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! Europe: డెన్మార్క్ వీధుల్లో భారత జెండాల రెపరెపలు.. అమరావతి బిల్లు ఆమోదంతో యూరోప్‌లో సంబరాలు.. US Iran War: చర్చల కోసం పాకిస్థాన్ బయల్దేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. మాతో ఆటలాడకండి - ఇరాన్‌కు వార్నింగ్ Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో.. Kanakaraju Movie: తమన్ మ్యూజిక్, మేర్లపాక కామెడీ.. ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ ప్రోమోతో అంచనాలు రెట్టింపు! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా..

LIK: ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్! ఫ్యూచరిస్టిక్ రొమ్-కామ్‌కు మిక్స్డ్ రివ్యూస్!

Love Insurance Kompany: ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. భవిష్యత్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ కథతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Published : 2026-04-10 14:55:00

కలర్‌ఫుల్ విజువల్స్, లవ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. 

సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌.. 

లవ్ ఇన్షూరెన్స్ కంపెనీ (LIK) సినిమా విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. భవిష్యత్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ కథతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సినిమా విదేశాల్లో ప్రారంభ ప్రదర్శనలు పూర్తయ్యాక, ప్రేక్షకులు వెంటనే సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఫ్యూచర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ప్రేమకథ, అద్భుతమైన విజువల్స్, టెక్నాలజీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కలర్‌ఫుల్ విజువల్స్, లవ్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయని ట్వీట్లు వెల్లువెత్తాయి. “ప్రదీప్ రంగనాథన్ నటన ఎప్పటిలాగే అద్భుతం” అంటూ అభిమానులు ప్రశంసించారు. అలాగే ప్రదీప్-కృతి శెట్టి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అయిందని పలువురు పేర్కొన్నారు.

S. J. సూర్య తన ప్రత్యేక పాత్రతో మెప్పించగా, యోగి బాబు తన కామెడీతో నవ్వులు పూయించారు. ప్రీ-ఇంటర్వెల్ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. “కొన్ని ఐడియాలు బాగా పనిచేశాయి, మరికొన్ని అంతగా లేవు… సెకండ్ హాఫ్‌లో ఇంకా ఆశిస్తున్నాం” అంటూ కామెంట్లు వినిపించాయి.

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. “బీజీఎమ్ వింటే హార్ట్ మెల్ట్ అవుతోంది” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో స్పందించారు. ‘ధీమా’ పాటకు కూడా మంచి స్పందన లభించింది.

సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ పనితనం, విజువల్ ఎఫెక్ట్స్, హైటెక్ సెట్టింగ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అయితే కొంతమంది ప్రేక్షకులు కథలో మంచి ఐడియాలు ఉన్నప్పటికీ, వాటి అమలు బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. “కాన్సెప్ట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ అంతగా ఆకట్టుకోలేదు” అంటూ కొందరు పేర్కొన్నారు.

ఈ చిత్రంలో గౌరీ జి. కిషన్, శ్రీరంజిని వంటి నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటించి కథకు బలం చేకూర్చారు.

ప్రేమ, కామెడీ, భవిష్యత్ టెక్నాలజీ కలయికతో రూపొందిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా ప్రేక్షకుల్లో చర్చకు దారితీస్తోంది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఈ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకర్షించడంలో సఫలమైందని చెప్పొచ్చు.

Spotlight

Read More →