Hall Tickets: SSC హాల్ టికెట్లు విడుదల చేసిన విద్యాశాఖ..! డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే! Canada Scholarship: భారత విద్యార్థులకు కెనడా స్కాలర్‌షిప్‌లు! ప్రతి ఏడాది 200 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్.. వెంటనే అప్లై చేసుకోండి! ISRO YUVIKA 2026: విద్యార్థులకు బంపర్ ఆఫర్! ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ! SSC Halltickets: 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్! హాల్ టికెట్లు వచ్చేశాయి.. ఇలా పొందండి! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! CUET Application: విద్యార్థులకు గుడ్ న్యూస్...! సీయూఈటీ దరఖాస్తుకు మరో ఛాన్స్! YUVIKA Training: అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇస్రో అవకాశం.. YUVIKA ట్రైనింగ్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం! Education News: నేటి నుంచే ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు దరఖాస్తులు.!! Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! School Holidays: విద్యార్థులకు పండగే పండగ..! మార్చి నెలలో స్కూళ్లకు సెలవులే సెలవులు..! Hall Tickets: SSC హాల్ టికెట్లు విడుదల చేసిన విద్యాశాఖ..! డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే! Canada Scholarship: భారత విద్యార్థులకు కెనడా స్కాలర్‌షిప్‌లు! ప్రతి ఏడాది 200 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్.. వెంటనే అప్లై చేసుకోండి! ISRO YUVIKA 2026: విద్యార్థులకు బంపర్ ఆఫర్! ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ! SSC Halltickets: 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్! హాల్ టికెట్లు వచ్చేశాయి.. ఇలా పొందండి! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! CUET Application: విద్యార్థులకు గుడ్ న్యూస్...! సీయూఈటీ దరఖాస్తుకు మరో ఛాన్స్! YUVIKA Training: అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇస్రో అవకాశం.. YUVIKA ట్రైనింగ్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం! Education News: నేటి నుంచే ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు దరఖాస్తులు.!! Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! School Holidays: విద్యార్థులకు పండగే పండగ..! మార్చి నెలలో స్కూళ్లకు సెలవులే సెలవులు..!

Exam Diet Tips: చదివింది మర్చిపోతున్నారా? అయితే ఈ 'బ్రెయిన్ ఫుడ్స్' ట్రై చేయండి.!!

పరీక్షల సమయంలో విద్యార్థులు చురుగ్గా ఉండటానికి, జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోండి..

Published : 2026-02-10 10:41:00

ఎగ్జామ్స్ వచ్చాయంటే చాలు.. స్టూడెంట్స్‌లో ఒకటే టెన్షన్. పుస్తకాల ముందు గంటల తరబడి కూర్చుని చదవడం, నిద్ర మానేయడం, తిండి మీద అస్సలు ధ్యాస లేకపోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, ఎంత చదివామన్నది ఒకెత్తయితే, పరీక్ష హాల్‌లోకి వెళ్ళాక అది గుర్తుకు రావడం అసలైన టాస్క్. మన మెదడు చురుగ్గా పనిచేయాలన్నా, చదివింది గుర్తుండాలన్నా మనం తీసుకునే ఆహారం చాలా ఇంపార్టెంట్ అని డాక్టర్లు చెబుతున్నారు. పరీక్షల టైంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు  తెలుసుకుందాం.

అతిగా తినొద్దు.. అలాగని ఆకలితో ఉండొద్దు!

చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ టైంలో అన్నం మానేసి కేవలం కాఫీలు, టీలతో కాలక్షేపం చేస్తారు. ఇది చాలా తప్పు. ఖాళీ కడుపుతో ఉంటే మెదడుకి అందాల్సిన గ్లూకోజ్ అందదు, దీనివల్ల త్వరగా అలసట వచ్చేస్తుంది. అందుకే, ఒక్కసారిగా కడుపు నిండా తినేయకుండా, కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినడం మంచిది. ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు. ఇడ్లీ, ఉప్మా లేదా పెసరట్టు వంటి తేలికపాటి ఆహారం తీసుకుంటే చదువుకునేటప్పుడు హుషారుగా ఉంటుంది.

నిద్ర రాకూడదంటే ఏం చేయాలి?

మధ్యాహ్నం పూట బాగా బిర్యానీలు లేదా ఆయిల్ ఫుడ్ తింటే ఖచ్చితంగా నిద్ర ముంచుకొస్తుంది. అందుకే, పరీక్షలు ఉన్నన్ని రోజులు పూరీ, వడ, బిర్యానీ వంటి వాటికి దూరంగా ఉండటం బెస్ట్. వీటికి బదులు జొన్న రొట్టెలు, గోధుమ చపాతీలు లేదా తక్కువ అన్నంతో ఎక్కువ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అలాగే పెరుగు అన్నం తింటే కడుపు ప్రశాంతంగా ఉండి, ఏకాగ్రత పెరుగుతుంది. రాత్రిపూట కూడా లైట్ ఫుడ్ తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది, మరుసటి రోజు ఉదయం మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది.

జ్ఞాపకశక్తి పెంచే చిట్కాలు

జ్ఞాపకశక్తి పెరగడానికి డ్రై ఫ్రూట్స్ చాలా బాగా పనిచేస్తాయి. రోజుకు నాలుగైదు బాదం పప్పులు, వాల్‌నట్స్ తింటే మెదడుకి మంచి పోషణ అందుతుంది. అలాగే ఆపిల్, అరటిపండు వంటి పండ్లు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. ముఖ్యం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ వేసవిలో నీళ్లు బాగా తాగాలి. నీళ్లు తక్కువైతే తలనొప్పి వచ్చి, చదివింది ఏమీ ఎక్కదు. అందుకే ఒక వాటర్ బాటిల్ ఎప్పుడూ పక్కనే ఉంచుకోండి. మధ్య మధ్యలో నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బాడీ రీఛార్జ్ అవుతుంది.

పిల్లలకి పరీక్షలంటేనే ఒత్తిడి ఆ టైంలో వారిని తినమని బలవంతం చేయకుండా, వారికి నచ్చేలా.. ఆరోగ్యంగా ఉండేలా ఆహారాన్ని అందించండి. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ చిప్స్ వంటివి అస్సలు ఇవ్వకండి. బదులుగా ఇంట్లో చేసిన నువ్వుల లడ్డూలు, వేరుశనగ పట్టీలు వంటివి స్నాక్స్‌గా ఇవ్వండి. ఇవి పిల్లల్ని చురుగ్గా ఉంచుతాయి. గుర్తుంచుకోండి.. మంచి ఆహారం, ప్రశాంతమైన నిద్ర ఉంటేనే పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలరు. ఆల్ ది బెస్ట్!

Spotlight

Read More →