Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు!

 కొంతకాలంగా వాణిజ్య యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన అమెరికా–చైనా సంబంధాలు మరోసారి మలుపు తిరిగాయి. ప్రపంచంలోని అతిపెద్ద రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య నెలకొన్న ఉద్

Published : 2025-10-30 12:00:00
Vivek Express: భారతదేశంలో పొడవైన రైలు! నాలుగు రోజుల అద్భుతమైన యాత్ర!

కొంతకాలంగా వాణిజ్య యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన అమెరికా–చైనా సంబంధాలు మరోసారి మలుపు తిరిగాయి. ప్రపంచంలోని అతిపెద్ద రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశం అత్యంత ఫలప్రదంగా నిలిచింది. ఈ భేటీని ట్రంప్ “ఒక అద్భుతమైన కొత్త ఆరంభం”గా అభివర్ణించారు. చర్చల అనంతరం ఆయన చైనాపై విధించిన సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో సంచలనం సృష్టించింది.

TollGate: ఆ హైవేపై కొత్త టోల్ వసూళ్లు మొదలు! ఇకపై వాహనదారులు చెల్లించాల్సిందే!

రెండు గంటలపాటు సాగిన రహస్య చర్చల్లో అనేక కీలక అంశాలపై చర్చించగా, ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ట్రంప్ మాట్లాడుతూ “ఇది ఎంతో ప్రగతిశీలమైన సమావేశం. సదభిప్రాయం ఏర్పడింది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం” అన్నారు. ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై 57 శాతం సుంకం ఉన్నదని, దాన్ని 47 శాతానికి తగ్గించడం తమ సత్సంకల్పానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి.

Gas Cylinder Subsidy: వంట గ్యాస్ సబ్సిడీ కావాలా? అయితే ఆది తప్పనిసరి.. మిస్స్ అవ్వోద్దు..!

ఈ చర్చల్లో అత్యంత కీలకమైన అంశం రేర్ ఎర్త్స్ ఎగుమతులపైనే. అమెరికా రక్షణ, హైటెక్ పరిశ్రమలకు అవి అత్యవసరం. ఈ రంగంలో అడ్డంకులను చైనా తొలగించేందుకు అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు. దీంతో రేర్ ఎర్త్స్ సరఫరాలో వచ్చే ఏడాది వరకు ఎటువంటి అంతరాయం ఉండదని అమెరికా అధికారులు తెలిపారు. అదేవిధంగా, అమెరికా రైతులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సోయాబీన్స్ కొనుగోళ్లను చైనా తక్షణమే పునఃప్రారంభించనుందని ట్రంప్ పేర్కొన్నారు. “ఇది మా రైతులకు గొప్ప విజయమని” ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

FinancialNews: యూనియన్‌ బ్యాంక్‌–బీఓఐ విలీనం మాట నిజమా? బ్యాంకింగ్ రంగంలో పెద్ద మార్పు రాబోతుందా?

మరో కీలక అంశంగా ఫెంటానిల్ అనే డ్రగ్ ఉత్పత్తిని అరికట్టేందుకు చైనా కఠిన చర్యలు తీసుకుంటుందని షీ జిన్‌పింగ్ హామీ ఇచ్చారు. అమెరికాలో ఒపియాయిడ్ సంక్షోభానికి ఇది ప్రధాన కారణమని ట్రంప్ తెలిపారు. సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి పరస్పర పర్యటనల ప్రణాళికలు కూడా ప్రకటించారు. “తైవాన్ అంశం ఈ చర్చల్లో అసలు ప్రస్తావనకే రాలేదు” అని ట్రంప్ వెల్లడించడం విశేషం. దీంతో అమెరికా–చైనా సంబంధాలు మరింత సానుకూల దిశలో పయనించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Gaza Israel : గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 60 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం!
Cyclone: అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం... గుజరాత్ మహారాష్ట్రకు భారీ వర్ష సూచన!
యూఏఈలో భారతీయులకు పెద్ద సౌకర్యం! కొత్త ఈ-పాస్‌పోర్ట్ వ్యవస్థ!
Delhi Pollution news: ఆకాశంలో మేఘాలు ఉన్నా వర్షం ఎందుకు రాలేదు? ఢిల్లీలో విఫలమైన రూ.60 లక్షల కృత్రిమ వర్ష ప్రయోగం వెనుక అసలైన సైన్స్ ఇదే!
TTD Updates: తిరుపతి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఇదే మంచి సమయం... తగ్గిన భక్తుల రద్దీ!
Cyber Hub: గ్లోబల్ సైబర్ హబ్‌గా భారత్..! స్టార్టప్‌ల స్ఫూర్తితో గ్లోబల్ భద్రతా రంగంలో కొత్త అధ్యాయం!

Spotlight

Read More →