Post Office SCSS: వృద్ధాప్యంలోనూ నెలవారీ ఆదాయం హామీ..! 8.20% వడ్డీతో సురక్షిత పెట్టుబడి..! Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్! Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే! Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు! Coffee Powder: బంగారం కంటే వేగంగా పెరుగుతున్న కాఫీ ధర! కారణం ఇదేనేమో! JIO Offer: జియో వినియోగదారులకు సూపర్ ఆఫర్..! ఏడాది పాటు టెన్షన్‌ లేకుండా ఫుల్‌ డేటా, ఫ్రీ కాల్స్..! SBI: ప్రపంచ ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐకు డబుల్ అవార్డులు..! ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గుర్తింపు..! UIDAI: ఆధార్ కార్డు అప్‌డేట్‌ ఇక ఒక్క క్లిక్‌తో..! నవంబర్‌ 1 నుంచి కొత్త సిస్టమ్ అమల్లోకి..! EPFO: ఉద్యోగం వదిలినా పెన్షన్ హక్కు మీది..! EPFO నియమాలు తెలుసుకోండి..! RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం..! వెండిపైనా రుణాలు.. ఒక్కరికి రూ.10 లక్షల వరకు..! Post Office SCSS: వృద్ధాప్యంలోనూ నెలవారీ ఆదాయం హామీ..! 8.20% వడ్డీతో సురక్షిత పెట్టుబడి..! Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్! Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే! Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు! Coffee Powder: బంగారం కంటే వేగంగా పెరుగుతున్న కాఫీ ధర! కారణం ఇదేనేమో! JIO Offer: జియో వినియోగదారులకు సూపర్ ఆఫర్..! ఏడాది పాటు టెన్షన్‌ లేకుండా ఫుల్‌ డేటా, ఫ్రీ కాల్స్..! SBI: ప్రపంచ ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐకు డబుల్ అవార్డులు..! ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గుర్తింపు..! UIDAI: ఆధార్ కార్డు అప్‌డేట్‌ ఇక ఒక్క క్లిక్‌తో..! నవంబర్‌ 1 నుంచి కొత్త సిస్టమ్ అమల్లోకి..! EPFO: ఉద్యోగం వదిలినా పెన్షన్ హక్కు మీది..! EPFO నియమాలు తెలుసుకోండి..! RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం..! వెండిపైనా రుణాలు.. ఒక్కరికి రూ.10 లక్షల వరకు..!

Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!

2025-11-06 14:32:00

రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి తానేటి  అనిత  మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేటి యువతే రేపటి ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు. అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువత రక్షణ, భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు” అని తెలిపారు.

డ్రగ్స్‌ సమస్యపై ప్రభుత్వం సున్నా సహనం విధానాన్ని అవలంబించిందని ఆమె చెప్పారు. ఈగల్‌ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సాగును దాదాపు జీరో స్థాయికి తగ్గించామని వివరించారు. “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదాన్ని పాఠశాల స్థాయికి తీసుకెళ్లి, 50 వేల స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

“ఒక తల్లి తన కుమార్తెను రక్షించండి అని వేడుకున్న సందర్భం నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ ఘటన తర్వాతే డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి పూర్తిగా తుడిచిపెట్టాలని సంకల్పించాం,” అని అనిత గారు చెప్పారు.

వైసీపీ పాలనలో డ్రగ్స్‌ దందా విస్తరించిందని ఆమె తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం యువతకు చెడు అలవాట్లు దూరం చేయాలని ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటుంటే, వైసీపీ మాత్రం ‘డ్రగ్స్ తీసుకో బ్రో’ అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. జగన్‌మోహన్ రెడ్డి పాలనలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ ను గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది, అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌కే దారి తీసేవని అనిత గారు తెలిపారు. “జగన్ ఐదేళ్ల పాలనలో డ్రగ్స్‌పై ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం మా ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసి, ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌, రైల్వే పోలీస్‌లతో సమన్వయంగా పనిచేస్తోంది” అని వివరించారు.

యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం డ్రగ్స్‌ వ్యసనాన్ని పూర్తిగా అంతమొందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి అనిత  స్పష్టం చేశారు.

Spotlight

Read More →