Airline Alert: బ్రిటిష్ ఎయిర్‌వేస్ సిబ్బందికి షాక్‌..! యూనిఫాంలో ఆ పని చేయకూడదు..!

 ప్రఖ్యాత అంతర్జాతీయ విమానయాన సంస్థ బ్రిటిష్ ఎయిర్‌వేస్ తన సిబ్బందిపై కొత్త నిబంధనలు అమలు చేస్తూ, క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రతిష్ఠను కాపాడే దిశగా చర్యలు చే

Published : 2025-09-12 13:20:00
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 8 పండుగ స్పెషల్ రైళ్లు.. ఆగే స్టేషన్లు - వివరాలు ఇవే.!

ప్రఖ్యాత అంతర్జాతీయ విమానయాన సంస్థ బ్రిటిష్ ఎయిర్‌వేస్ తన సిబ్బందిపై కొత్త నిబంధనలు అమలు చేస్తూ, క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రతిష్ఠను కాపాడే దిశగా చర్యలు చేపట్టింది. తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం, పైలట్లు, క్యాబిన్ క్రూ సభ్యులు యూనిఫాంలో ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో కాఫీ, టీ లేదా శీతల పానీయాలు తాగకూడదు. ఆ సందర్భంలో వారికి నీళ్లు మాత్రమే అనుమతించబడతాయి, అయితే అవి కూడా ఇతరులకు పెద్దగా కనిపించకుండా జాగ్రత్తగా తాగాలని ఆదేశాలు జారీ చేశారు.

CMs ideas Minister : సీఎం ఆలోచనలతో రాష్ట్రంలో నీటి నిల్వలు పెరిగాయి.. మంత్రి నిమ్మల!

ఇకపై కాఫీ, టీ లేదా ఇతర పానీయాలను కేవలం సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాఫ్ రూమ్‌లు, కేఫ్టీరియాలలో మాత్రమే సేవించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి అలవాట్లు విమానయాన సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉందన్న ఆందోళనతో ఈ కొత్త ఆంక్షలు విధించబడ్డాయి.

SBI: బ్యాంక్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్‌..! SBI పెంచిన ఆటో స్వీప్ పరిమితి వివరాలు ఇవే!

కేవలం పానీయాలపైనే కాదు, సోషల్ మీడియా వాడకంపై కూడా కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా, లేఓవర్ హోటళ్ల ఫొటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. కారణం— ఆధునిక ఏఐ టూల్స్ ద్వారా ఫొటోల బ్యాక్‌గ్రౌండ్‌ను విశ్లేషించి, హోటల్ లొకేషన్ బయటపడే ప్రమాదం ఉందని సంస్థ చెబుతోంది. ఇప్పటికే పోస్ట్ చేసిన హోటల్ కంటెంట్‌ను కూడా తొలగించాల్సిందేనని, లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Activa Scooty: బైక్ కొనడానికి ఇది గోల్డెన్ ఛాన్స్.. హోండా టూ-వీలర్స్‌పై భారీగా ధరల తగ్గింపు! పూర్తి లిస్ట్ ఇదే.!

అలాగే, సిబ్బంది యూనిఫాంలో ఇంటి నుండి బయలుదేరి విధులకు రావడం, విధులు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లడం కూడా నిషేధించారు. గతంలో కూడా యూనిఫాంలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంపై బ్రిటిష్ ఎయిర్‌వేస్ నిబంధనలు పెట్టిన విషయం తెలిసిందే. సంస్థ తన బ్రాండ్ ఇమేజ్, సిబ్బంది భద్రతను కాపాడేందుకే ఈ మార్పులు చేసినప్పటికీ, ఈ ఆంక్షలపై సిబ్బందిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Bullet Train: గంటకు 350 కి.మీ వేగంతో బుల్లెట్ రైలు! ఇక 3 గంటల్లో చెన్నై.. రూట్ ఇదే!
AP Govt: రేషన్‌లో స్మార్ట్ మార్పులు..! ఇక తప్పులు సులభంగా సరిదిద్దుకోండి..!
New Railway Station AP: ఏపీలో మరో కొత్త రైల్వే స్టేషన్.. తొలిసారి రైలు కూత - ప్రజల్లో ఆనందం! అభివృద్ధికి కీలక అడుగు..
Chandrababu: మహిళలకు చంద్రబాబు గిఫ్ట్..! ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం!
India Pak match: హాట్ కేకుల్లా అమ్ముడయ్యే టికెట్లు.. ఈసారి అమరుల గౌరవం కోసం బలి!

Spotlight

Read More →