Digital Safety: పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి NPCI హెచ్చరిక..! ఈ తప్పులు చేయొద్దు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 25,000 కోట్ల రూపాయల ఖర్చుతో అమరావతి రాజధాని పరిధిలో 190 కిలోమీటర్ల పొడవైన రింగ్ రోడ్ నిర్మించబోతున్నారు. ఇప్పటికే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు ఈ ప్రాజెక్ట్ కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, మొత్తం నిర్మాణాన్ని 12 ప్యాకేజీలుగా విభజించి దశలవారీగా పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని వాణిజ్య, రవాణా, లాజిస్టిక్స్ రంగాలకు గణనీయమైన ఉపయోగం కలగనున్నది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రజల ఆగ్రహం..నో కింగ్స్ నినాదాలు!!

ఈ 190 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్ నిర్మాణంలో ఆరు వరుసల ప్రధాన రోడ్లు, రెండు వైపులా నాలుగు వరుసల సర్వీస్ రోడ్లు, కృష్ణానదిపై రెండు భారీ వంతెనలు, రెండు పొడవైన టన్నెల్స్ మరియు అనుసంధాన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. గంగినేనిపాలెం అటవీ ప్రాంతంలో కొండల మధ్య 1.64 కిమీ, 2.68 కిమీ పొడవుల రెండు టన్నెల్స్ తవ్వనున్నారు. అలాగే మున్నలూరు వద్ద 3.15 కిమీ, మున్నంగి వద్ద 4.8 కిమీ పొడవు కలిగిన బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (158 కిమీ) కంటే పొడవుగా ఉండటం ప్రత్యేకత.

తలనొప్పి ఎక్కువవుతోంది? ఇలా కొన్ని చిన్న మార్పులు మీకు ఉపశమనం ఇస్తాయి!!

ఈ మొత్తం నిర్మాణానికి సుమారు 24,791 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం 3,117 కోట్లు భరిస్తుంది. ప్రస్తుతంలో భూసేకరణ కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రింగ్ రోడ్ కు అనుసంధానంగా రెండు స్పర్ రోడ్లు కూడా నిర్మించనున్నారు. తెనాలి సమీపం నుంచి కాజ్ టోల్‌ప్లాజా వరకు 17.5 కిమీ పొడవు, నారాకోడూరు నుంచి బుడంపాడు వరకు 5.2 కిమీ పొడవు కలిగిన రెండు స్పర్ రోడ్ల నిర్మాణం జరుగుతోంది.

పటాసులు కాదు… ఆవు పేడలే సంబరాల కేంద్రం! కర్ణాటకలో దీపావళి ప్రత్యేకం!!

అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణం పూర్తయిన తర్వాత, రాజధాని ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. వాణిజ్య మరియు ప్రయాణికులకు రింగ్ రోడ్ ద్వారా సమయాన్ని తగ్గిస్తూ ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. డీపీఆర్ ప్రకారం, ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత రాష్ట్రానికి ఆర్ధికంగా, లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన లాభాలు చేకూరుస్తుంది. NHAI ఉన్నతాధికారులు ప్రతిపాదనలను పరిశీలించి తుది ఆమోదం త్వరలో ప్రకటించనున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిలో కీలకంగా మారనుంది.

Liquor shops: మద్యం టెండర్లలో సంచలనం..! 150 షాపుల కోసం దరఖాస్తు చేసిన ఏపీ మహిళ..!
బంగారం ధరలు వినగానే షాక్ అవ్వాల్సిందే…10 గ్రాముల రేటు ఎంతంటే!
SIB Jobs: డిగ్రీ ఉన్నవారికి డైరెక్ట్ హైరింగ్..! జూనియర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఓపెన్..!
RTC: దీపావళికి ఆర్టీసీ ఉద్యోగులకు డబుల్‌ గిఫ్ట్‌..! డీఏతో పాటు వాటిని కూడా ప్రకటించిన సీఎం చంద్రబాబు..!
ఏపీ ఉద్యోగులకు దీపావళి డబుల్ ట్రీట్.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి!