ప్రస్తుత టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ ప్రతి రోజు కొత్త మోడళ్లతో సందడి చేస్తోంది. అప్‌గ్రేడ్ టెక్నాలజీ, అత్యాధునిక ఫీచర్లు, పెరిగిన పనితీరు – ఇవన్నీ వినియోగదారులను కొత్త ఫోన్ల వైపు ఆకర్షిస్తున్నాయి. పాత ఫోన్‌ను అమ్మేసినా, ఎక్స్‌చేంజ్‌లో ఇచ్చినా, వినియోగదారులు కొత్త మోడల్‌ను అనుభవించేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు కూడా డిస్కౌంట్లు, లాంచ్ ఆఫర్లు, బోనస్ ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో మొబైల్ విక్రయాలు ఏటా భారీగా పెరుగుతూ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి.
ఇక ప్రపంచంలో ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్ల జాబితాలో మొదటి స్థానం మాత్రం ఇప్పటికీ పాతకాలం నాటి నోకియా 1100దే. HowStuffWorks నివేదిక ప్రకారం, 2003లో విడుదలైన ఈ ఫోన్ అద్భుతంగా 25 కోట్లకుపైగా యూనిట్లు అమ్ముడైంది. ఈ చిన్న ఫోన్‌లో టార్చ్‌లైట్, సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్, రఫ్ అండ్ టఫ్ బాడీ, నీళ్లలో పడ్డా పనిచేసే సామర్థ్యం, రోజులు పాటు పనిచేసే బ్యాటరీ లైఫ్ వంటి లక్షణాలు వినియోగదారులను విపరీతంగా ఆకర్షించాయి. రాతి కట్టిలాంటి బలమైన బాడీతో “పగలని ఫోన్” పేరిట నోకియా 1100 ప్రపంచవ్యాప్తంగా రాజ్యం చేసింది.
అత్యధిక విక్రయాల జాబితాలో తదుపరి స్థానాలు యాపిల్ ఐఫోన్ 6 మరియు ఐఫోన్ 6 ప్లస్ ఆక్రమించాయి. 2014లో విడుదలైన ఈ మోడళ్లను 22 కోట్లకుపైగా మంది కొనుగోలు చేశారు. పెద్ద స్క్రీన్, స్లిమ్ డిజైన్, శక్తివంతమైన A8 చిప్, మెరుగైన కెమెరా వంటి వినూత్న లక్షణాలు ఐఫోన్ 6 సిరీస్‌ను అద్భుత విజయవంతం చేశాయి. అప్పుడు యాపిల్ ప్రపంచ మార్కెట్లో భారీగా బూస్ట్ పొందిన కాలం అదే. ఈ సిరీస్‌తో యాపిల్ స్మార్ట్‌ఫోన్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది.
ఆండ్రాయిడ్ ఫోన్లలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫ్లాగ్‌షిప్ మోడల్ మాత్రం శాంసంగ్ గెలాక్సీ S4. 2013లో విడుదలైన ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల యూనిట్లు అమ్ముడైంది. ఆమోల్డ్ డిస్‌ప్లే, శక్తివంతమైన హార్డ్‌వేర్, కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లు—ఇవన్నీ గెలాక్సీ S4ను ఆండ్రాయిడ్ రంగంలో బెస్ట్ సెల్లర్‌గా నిలబెట్టాయి. అదే సమయంలో 2019లో వచ్చిన ఐఫోన్ 11 కూడా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫేస్ ఐడీ, మెరుగైన కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్ కారణంగా భారత్, యూరప్, అమెరికా మార్కెట్లలో ఐఫోన్ 11 అమ్మకాలు దూకుడు చూపాయి. ప్రస్తుతం కూడా ఈ ఫోన్ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ మోడళ్లలో ఒకటిగా నిలిచింది.