Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే!

ట్రంప్‌ సుంకాల బాంబు – ఫార్మా రంగం కుదేలవుతుందా?

అమెరికా మార్కెట్‌కి భారత్‌ ఔషధాలను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది. ఇప్పటికీ అమెరికా, భారత ఔషధాలపై 50 శాతం సుంకం వేస్తోంది. తాజాగా ట్రంప్‌ మరో పెద్ద ప్రకటన చేశారు

Published : 2025-09-26 17:08:00
Free bus: ఏపీలో ఉచిత బస్సు పథకం.. మరో గుడ్‌న్యూస్..! ఇక పై ఆ సమస్య క్లియర్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

అమెరికా మార్కెట్‌కి భారత్‌ ఔషధాలను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది. ఇప్పటికీ అమెరికా, భారత ఔషధాలపై 50 శాతం సుంకం వేస్తోంది. తాజాగా ట్రంప్‌ మరో పెద్ద ప్రకటన చేశారు. 2025 అక్టోబర్‌ 1 నుంచి అమెరికాలో అమ్ముడవుతున్న అన్ని బ్రాండెడ్, పేటెంట్‌ ఉన్న ఔషధాలపై 100 శాతం సుంకం వేయబోతున్నట్టు తెలిపారు. అయితే అమెరికాలోనే తయారయ్యే మందులకు మాత్రం ఈ పన్ను వర్తించదని స్పష్టం చేశారు. అలాగే వంటింటి వస్తువులు, బాత్‌రూమ్‌లో ఉపయోగించే వస్తువులు, కొన్ని రకాల ఫర్నీచర్‌ మీద కూడా అదనపు సుంకాలు విధిస్తున్నామని ప్రకటించారు. వీటన్నిటిని దేశీయ తయారీని రక్షించడానికి తీసుకున్న నిర్ణయమని ఆయన రాశారు.

Insurance Clash: టాటా ఏఐజీ షాక్..! మ్యాక్స్ హాస్పిటల్స్‌లో ఆ సర్వీసులు నిలిపివేత..!

భారత్‌ ఫార్మా రంగం ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన ఎగుమతి కేంద్రంగా నిలుస్తోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్‌ (జీటీఆర్ఐ) ప్రకారం, భారత్‌ నుంచి అమెరికాకు ఏటా సుమారు 12.7 బిలియన్ డాలర్ల (రూ.1,12,000 కోట్లకు పైగా) విలువైన ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా జనరిక్ మందులే. బ్రాండెడ్ మందులు కూడా వెళ్తున్నా వాటి వాణిజ్యం తక్కువే. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, లుపిన్‌ వంటి భారతీయ కంపెనీలు బ్రాండెడ్ ఔషధాలను అమెరికాకు పంపుతున్నాయి. ట్రంప్‌ కొత్త సుంకాల వల్ల జనరిక్‌, బ్రాండెడ్‌ ఔషధాల ధరలు అమెరికాలో పెరుగుతాయని జీటీఆర్ఐ స్పష్టం చేసింది.

BSNL 4G Network: రేపు దేశవ్యాప్తంగా ప్రధాని చేతుల మీదుగా బీఎస్ఎన్ఎల్ 4 జీ సేవలు ప్రారంభం!

భారతీయ కంపెనీలు అమెరికాలో చాలా తక్కువ లాభ మార్జిన్లతో పనిచేస్తున్నాయి. అయినా కూడా ఉత్తర అమెరికా మార్కెట్‌నే తమ ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకున్నాయి. వీటి లాభాల్లో మూడో వంతు వరకు అమెరికా నుంచే వస్తోంది. జనరిక్ మందులు చౌకైనవి కాబట్టి అమెరికాలో ప్రిస్క్రిప్షన్లలో 90 శాతం వరకు ఇవే వాడుతున్నారు. ఒక అంచనా ప్రకారం 2022లో భారత జనరిక్ మందుల వల్ల అమెరికా ప్రజలు 219 బిలియన్ డాలర్ల ఆరోగ్య ఖర్చును ఆదా చేసుకున్నారు. అంటే భారత్‌ నుంచి వచ్చే మందులు అమెరికా ఆరోగ్య వ్యవస్థకు బలంగా తోడ్పడుతున్నాయి.

BSNL: బీఎస్ఎన్ఎల్ సరికొత్త 4జీ నెట్‌వర్క్..! భారత టెలికాం రంగంలో కొత్త దశ..!

నిపుణుల అంచనా ప్రకారం ట్రంప్‌ సుంకాల వల్ల భారతీయ కంపెనీలకు పెద్ద సవాళ్లు ఎదురవుతాయి. వాణిజ్య ఒప్పందం లేకపోవడం వల్ల కొన్ని కంపెనీలు అమెరికా మార్కెట్‌ నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి   రావాల్సిందే. అలా అయితే అమెరికా రోగులకు మందుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. మరోవైపు, భారత్‌ వంటి దేశాల నుంచి జనరిక్‌ మందులు తగ్గిపోతే అమెరికా ఆరోగ్య వ్యవస్థకు భారీగా భారమవుతుంది. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయాలు ముందుకు వెళ్తే అమెరికా, భారత్‌ వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

H-IB Visa Fee: చాలా దేశాల్లో అవసరమైనంత శ్రామిక శక్తి లేదు... మంత్రి కీలక వ్యాఖ్యలు!
Ticket prices: టికెట్ రేట్లపై రగులుతున్న చర్చ.. హీరోల మధ్య మాటల వార్ మొదలవుతుందా!
Pawan kalyan: అభిమానుల ప్రార్థనలు.. అన్నయ్య త్వరగా కోలుకోవాలి.. OG విజయాన్ని ఎంజాయ్ చేయాలి.. సీఎం సందేశం!
సరికొత్త సంచలనం - 'ఓజీ' సునామీ.. కూలీ రికార్డు బ్రేక్.. టాప్ 5 ఇండియన్ సినిమాల్లో పవన్ మూవీ!
పాలిటెక్నిక్, నవోదయా స్కూల్స్ పై అసెంబ్లీలో చర్చ... త్వరలో పరిష్కారం అంటున్న లోకేష్!!
150 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి..49.9% పోస్టులు వారికి రావడం సంతోషం అంటున్నా లోకేష్!!

Spotlight

Read More →