రూ.2 వేల నోట్లపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన రూ.2 వేల నోట్ల (Rs.2000 notes) లో దాదాపు 98.04 శాతం నోట్లు ప్రజల నుంచి తిరిగి బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. కేవలం రూ.6,970 కోట్ల విలువ చేసే 2 వేల నోట్లు మాత్రమే ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. వీటిని సర్క్యులేషన్ నుంచి ఉపసంహరిస్తున్నట్లు 2023 మే నెలలో ప్రకటించింది. ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నప్పటికీ.. వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేసింది. 2016 నవంబరు నెలలో.. అప్పటికి చలామణీలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2 వేల విలువైన పెద్ద నోటును ప్రవేశపెట్టింది. తర్వాత క్రమంలో రూ.2 వేల బ్యాంక్ నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ గతేడాది మే 19న ప్రకటించింది. అప్పటికి సర్క్యులేషన్లో ఉన్నటువంటి ఈ 2 వేల రూపాయల నోట్ల విలువ ఏకంగా రూ.3.56 లక్షల కోట్లు. కాగా.. ఆర్బీఐ ప్రకటన తర్వాత ప్రజలు నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదా తమ ఖాతాల్లో జమ చేసుకోవడం చేశారు. ఇందుకోసం 2023, అక్టోబర్ 7 వరకు అవకాశం కల్పించింది. తొలుత రిజర్వ్ బ్యాంకు అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ అవకాశం కల్పించింది.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇప్పుడు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనే 2 వేల రూపాయల నోట్లు ఉపసంహరించేందుకు అవకాశం ఉంది. హైదరాబాద్ సహా మొత్తం 19 ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో వీటిని అప్పగించి.. వారి అకౌంట్లలోకి జమ చేసుకోవడం లేదా ఇతర నోట్లలోకి కూడా మార్చుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికిని 2 వేల నోట్లను ఉపసంహరించుకున్నప్పటికీ.. రద్దు మాత్రం చేయలేదు. ఇప్పటికీ దీనిని చెల్లుబాటు కరెన్సీగానే పేర్కొంటుంది ఆర్బీఐ. ఇంకా రూ. 6970 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు జనం దగ్గర ఉన్నాయన్నమాట. అయితే ఇవి చెల్లుబాటు కరెన్సీ అయినప్పటికీ.. బయట తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించని నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే 100 శాతం నోట్లు వెనక్కి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తోంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మటన్‌తో కలిపి ఈ 3 పదార్థాలు తింటున్నారా? ఇక మీ ఆయుష్షు మూడినట్లే! దీని మాంసం మానవ శరీరానికి చాలా!
సొంత పార్టీ జూనియర్ మంత్రిపై చంద్రబాబు సీరియస్? ఆడియో కాల్ వైరల్! ఈ ఐదు నెలల్లో ప్రభుత్వ!
జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!
11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!
దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్, ఈ ఛాన్స్ వదలొద్దు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: