Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే...

Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో!

కువైట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. భద్రతా కారణాలతో విమానాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించగా, 186 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

Published : 2026-01-30 16:23:00

కువైట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అనుమానాస్పద పరిస్థితి తలెత్తడంతో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో మొత్తం 186 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 180 మంది ప్రయాణికులు, మిగతా వారు సిబ్బంది కాగా, వారందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు.

విమానం గాల్లో ఉండగానే, సిబ్బందికి ఓ టిష్యూ పేపర్‌పై చేతిరాతతో రాసిన బెదిరింపు నోట్ కనిపించింది. ఆ నోట్‌లో విమానంలో బాంబు ఉందని, విమానాన్ని హైజాక్ చేస్తామని హెచ్చరించడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ సమాచారాన్ని వెంటనే పైలట్‌కు తెలియజేయడంతో ఆయన ఏవియేషన్ భద్రతా నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి పరిస్థితిని వివరించిన పైలట్, సమీపంలోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించారు. ప్రయాణికుల భద్రతే ప్రధానంగా నిర్ణయాలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.

విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులందరినీ కిందకు దించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేశాయి. ప్రతి సీటు, లగేజ్ ర్యాక్, కార్గో విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎన్.డి. నకుమ్ మాట్లాడుతూ, “తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. విమానం పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారించాం. అయితే ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది” అని తెలిపారు.

ఇప్పుడు అధికారులు ఆ చేతిరాత బెదిరింపు నోట్ విమానంలోకి ఎలా చేరింది, ఎవరు రాశారు అనే అంశాలపై దృష్టి సారించారు. ప్రయాణికులు, సిబ్బంది నుంచి సమాచారం సేకరిస్తూ, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. విమానం తిరిగి ఢిల్లీకి ఎప్పుడు బయలుదేరుతుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల అహ్మదాబాద్‌తో పాటు పలు నగరాల్లో బాంబు బెదిరింపులు రావడం, అవన్నీ వట్టివేనని తేలడం గమనార్హం. అయినప్పటికీ, ప్రతి బెదిరింపును తేలిగ్గా తీసుకోకుండా పూర్తి స్థాయి భద్రతా చర్యలు చేపడుతున్నామని అధికారులు స్పష్టం చేశారు.

Spotlight

Read More →