Suryakumar: భార్య సలహానే టర్నింగ్ పాయింట్.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు! T20 World Cup: గ్రూప్-Cలో స్కాట్లాండ్.. T20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఇదే! ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Bangladesh out : T20 WC నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్! Bangladesh: క్రీడకే కాదు.. కృతజ్ఞతకూ దూరమైన బంగ్లాదేశ్.. భద్రతా కారణమా.. లేక రాజకీయ లెక్కలా! Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ! ICC: బంగ్లాదేశ్‌కు షాక్.. భారత్‌లో ఆడాల్సిందేనన్న ICC! ఐపీఎల్ 2026 షెడ్యూల్‌కు బ్రేక్: ఎన్నికలు, స్టేడియంల గొడవతో బీసీసీఐ తలనొప్పి.. అభిమానులకు ఎదురుచూపులు! Cricket News: టీ20 ప్రపంచకప్ ముందు కుల్దీప్ పై రోహిత్ కీలక వ్యాఖ్యలు..!! Team Indias: టీమ్ ఇండియా అప్రతిష్ఠ.. బౌలింగ్‌లో లోపాలే కారణమా.. షమీ లేకపోవడం భారీ లోటు! Suryakumar: భార్య సలహానే టర్నింగ్ పాయింట్.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు! T20 World Cup: గ్రూప్-Cలో స్కాట్లాండ్.. T20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఇదే! ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Bangladesh out : T20 WC నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్! Bangladesh: క్రీడకే కాదు.. కృతజ్ఞతకూ దూరమైన బంగ్లాదేశ్.. భద్రతా కారణమా.. లేక రాజకీయ లెక్కలా! Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ! ICC: బంగ్లాదేశ్‌కు షాక్.. భారత్‌లో ఆడాల్సిందేనన్న ICC! ఐపీఎల్ 2026 షెడ్యూల్‌కు బ్రేక్: ఎన్నికలు, స్టేడియంల గొడవతో బీసీసీఐ తలనొప్పి.. అభిమానులకు ఎదురుచూపులు! Cricket News: టీ20 ప్రపంచకప్ ముందు కుల్దీప్ పై రోహిత్ కీలక వ్యాఖ్యలు..!! Team Indias: టీమ్ ఇండియా అప్రతిష్ఠ.. బౌలింగ్‌లో లోపాలే కారణమా.. షమీ లేకపోవడం భారీ లోటు!

Suryakumar: భార్య సలహానే టర్నింగ్ పాయింట్.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!

టీ20 WC ముందు గుడ్ న్యూస్… పాత ఫామ్‌లోకి సూర్యకుమార్ క్రీజులో కుదురుకోమన్న భార్య మాటే విన్నా SKY 23 ఇన్నింగ్స్ ఎదురుచూపులకు ముగింపు… హాఫ్ సెంచరీ హీరో SKY

2026-01-25 21:18:00
Liquor Shops: మందుబాబులకు షాక్..! ఏపీ–తెలంగాణలో లిక్కర్ షాపులు బంద్!
  • టీ20 WC ముందు గుడ్ న్యూస్… పాత ఫామ్‌లోకి సూర్యకుమార్
    క్రీజులో కుదురుకోమన్న భార్య మాటే విన్నా..  SKY
    23 ఇన్నింగ్స్ ఎదురుచూపులకు ముగింపు… హాఫ్ సెంచరీ హీరో SKY
BSNL Recharge Offer: రిపబ్లిక్ డే స్పెషల్.. బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో అదిరిపోయే ఆఫర్..!!

భార్య సూచననే పాటించా అంటూ భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఆసక్తికరంగా మారాయి. దాదాపు 468 రోజుల పాటు హాఫ్ సెంచరీ లేకుండా గడిపిన సూర్య, చివరకు న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 37 బంతుల్లో 82 పరుగులతో అద్భుతంగా చెలరేగి తన ఫామ్‌పై ఉన్న అన్ని అనుమానాలకు సమాధానం చెప్పాడు. ఈ ఇన్నింగ్స్‌తో 23 ఇన్నింగ్సుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. 

Pawan Kalyan son: AI దుర్వినియోగం కేసు.. పవన్ కళ్యాణ్ కుమారుడిపై వీడియో క్రియేటర్ అరెస్ట్!

మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య, తన తిరిగి ఫామ్‌లోకి రావడానికి ముఖ్య కారణం తన భార్య దేవిషా ఇచ్చిన సలహేనని చెప్పాడు. క్రీజులో తొందరపడకుండా కాస్త సమయం తీసుకుని ఆడాలని ఆమె సూచించిందని, అదే పద్ధతిని న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టీ20ల్లో పాటించానని తెలిపాడు. గత కొంతకాలంగా సూర్య ఆటపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో అతని ఫామ్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే తాజా ఇన్నింగ్స్‌తో సూర్య తనపై వస్తున్న అన్ని విమర్శలను పటాపంచలు చేశాడు.

ముఖ్యంగా 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడం అతని సహజమైన దూకుడు బ్యాటింగ్‌కు నిదర్శనంగా నిలిచింది. అంతేకాదు, ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున అత్యధిక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో సూర్య కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 126 టీ20I మ్యాచ్‌లు ఆడిన సూర్య, 125 మ్యాచ్‌లతో ఉన్న విరాట్ కోహ్లీని అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 159 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు అత్యంత కీలక ఆటగాడిగా మారిపోయిన విషయం తెలిసిందే.

360 డిగ్రీ షాట్లతో బౌలర్లకు ముచ్చెమటలు పట్టించే సూర్య, ఫామ్‌లో ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టుకు నిద్ర లేకుండా చేస్తాడు. అయితే గత కొన్ని నెలలుగా సరైన స్కోర్లు చేయలేక ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు తిరిగి పాత సూర్యను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అతని భార్య దేవిషా సలహానే తనకు టర్నింగ్ పాయింట్‌గా మారిందని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెటర్ల జీవితాల్లో కుటుంబ మద్దతు ఎంత కీలకమో మరోసారి రుజువైంది. రాబోయే టీ20 వరల్డ్ కప్‌కు ముందు సూర్య ఫామ్‌లోకి రావడం టీమ్ ఇండియాకు శుభపరిణామంగా భావిస్తున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే మరోసారి టీ20 ప్రపంచంలో భారత జట్టు కీలక పాత్ర పోషించే అవకాశాలు మరింత బలపడతాయి.

Spotlight

Read More →