Chickentahari: బిర్యానీకి మించిన రుచి.. హైదరాబాదీ చికెన్ తహారీ.. ఇంట్లోనే ఇలా చేసేయండి! Boneless Biryani: హోటల్ స్టైల్ చికెన్ బోన్‌లెస్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చిటికెలో చేసేయండి! Royyala Pachadi: రొయ్యల పచ్చడి చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేస్తే బూజు పట్టడం ఖాయం! Weight Loss: ఉదయాన్నే రాగి ఊతప్పం.. ఆరోగ్యం మరియు రుచికి కేరాఫ్ అడ్రస్! Cucumber Pachdi: నోరూరించే దోసకాయ రోటి పచ్చడి.. ఒక్కసారి ఈ స్టైల్ లో చేయండి అదిరిపోయే రుచి మీ సొంతం! Majjiga Atlu: అమ్మమ్మల నాటి కమ్మని 'మజ్జిగట్లు'.. స్పాంజ్ లాంటి అట్లు ఈజీ ప్రాసెస్! TomatoOmelet: నోరూరించే స్పైసీ టొమాటో ఆమ్లెట్..! కేవలం 10 నిమిషాల్లో రెడీ! Thandai: శివరాత్రి స్పెషల్ ఎనర్జీ డ్రింక్... ఇంట్లోనే టేస్టీ 'థండాయ్' తయారు చేసుకోండిలా! American Lamb Benefits: అమెరికన్లు ఈ మాంసాన్ని ఎందుకు ఇంత పిచ్చిగా ఇష్టపడతారో తెలుసా? Coconut Chutney: ఒకసారి ఇలా కొబ్బరి పచ్చడి చేసి చూడండి…! భోజనం రుచి రెట్టింపుగా..! Chickentahari: బిర్యానీకి మించిన రుచి.. హైదరాబాదీ చికెన్ తహారీ.. ఇంట్లోనే ఇలా చేసేయండి! Boneless Biryani: హోటల్ స్టైల్ చికెన్ బోన్‌లెస్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చిటికెలో చేసేయండి! Royyala Pachadi: రొయ్యల పచ్చడి చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేస్తే బూజు పట్టడం ఖాయం! Weight Loss: ఉదయాన్నే రాగి ఊతప్పం.. ఆరోగ్యం మరియు రుచికి కేరాఫ్ అడ్రస్! Cucumber Pachdi: నోరూరించే దోసకాయ రోటి పచ్చడి.. ఒక్కసారి ఈ స్టైల్ లో చేయండి అదిరిపోయే రుచి మీ సొంతం! Majjiga Atlu: అమ్మమ్మల నాటి కమ్మని 'మజ్జిగట్లు'.. స్పాంజ్ లాంటి అట్లు ఈజీ ప్రాసెస్! TomatoOmelet: నోరూరించే స్పైసీ టొమాటో ఆమ్లెట్..! కేవలం 10 నిమిషాల్లో రెడీ! Thandai: శివరాత్రి స్పెషల్ ఎనర్జీ డ్రింక్... ఇంట్లోనే టేస్టీ 'థండాయ్' తయారు చేసుకోండిలా! American Lamb Benefits: అమెరికన్లు ఈ మాంసాన్ని ఎందుకు ఇంత పిచ్చిగా ఇష్టపడతారో తెలుసా? Coconut Chutney: ఒకసారి ఇలా కొబ్బరి పచ్చడి చేసి చూడండి…! భోజనం రుచి రెట్టింపుగా..!

Prawns Fry Telugu: ఒక్కసారి ఇలా రొయ్యల వేపుడు చేశారంటే.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

రుచికరమైన రొయ్యల వేపుడును హోటల్ స్టైల్‌లో ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకోండి మరి తక్కువ సమయంలో అద్భుతమైన రుచితో రొయ్యల ఫ్రై చేసే విధానం మీకోసం.

Published : 2026-03-01 11:41:00

రొయ్యలు అంటే  ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరేమో  బహుశా ముఖ్యంగా రొయ్యల వేపుడు ఉంటే ఆ మజాయే వేరు. అయితే చాలామంది హోటల్స్‌లో దొరికే ఆ రుచి ఇంట్లో రావడం లేదని బాధపడుతుంటారు. కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే రెస్టారెంట్ కంటే అద్భుతమైన రుచితో రొయ్యల వేపుడును మనం కిచెన్‌లోనే సిద్ధం చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండే మసాలాలతోనే ఈ వంటకాన్ని పూర్తి  చేసుకోవచ్చు.

ముందుగా రొయ్యల వేపుడు పక్కాగా రావాలంటే రొయ్యల ఎంపిక, వాటి శుభ్రత చాలా ముఖ్యం. మార్కెట్ నుండి తెచ్చిన రొయ్యలను ఉప్పు, నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల రొయ్యల పైన ఉండే జిగురు, నీచు వాసన పూర్తిగా పోతాయి. ఆ తర్వాత రొయ్యల వెనుక భాగంలో ఉండే నల్లటి నరాన్ని తీసేయడం మర్చిపోవద్దు. ఇలా శుభ్రం చేసుకున్న రొయ్యల్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకుంటే అవి గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి.

వంట ప్రారంభించేటప్పుడు ఒక మందపాటి బాణలిని తీసుకుని అందులో నూనె వేడి చేయాలి. నూనె కాగాక జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే చిటికెడు ఉప్పు వేయడం మంచిది. ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చాక, తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు తాజాగా నూరుకుంటే కూరకు మంచి సువాసన వస్తుంది.

ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న రొయ్యలను బాణలిలో వేయాలి. రొయ్యల నుండి నీరు ఊరుతుంది కాబట్టి, ఆ నీరంతా పోయి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఆ తర్వాత తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. రొయ్యలను మరీ ఎక్కువ సేపు వేయిస్తే అవి రబ్బరులా సాగుతాయి, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. మసాలాలన్నీ రొయ్యలకు పట్టి, ముక్కలు ఎర్రగా వేగాక చివరగా కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి రొయ్యల వేపుడు సిద్ధం.

ఈ రొయ్యల వేపుడును పప్పుచారుతో గానీ లేదా సాంబార్‌తో గానీ సైడ్ డిష్‌గా తింటే అమృతంలా ఉంటుంది. కేవలం అన్నంలోకే కాకుండా చపాతీల్లోకి కూడా ఇది మంచి కాంబినేషన్. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఇంటి మెంబర్స్‌ అందరికీ నచ్చేలా ఇలాంటి రుచికరమైన వంటకాన్ని మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. మీ ఇంట్లో వాళ్లంతా కచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు..

Spotlight

Read More →