Health Tips: రోజుకు ఎన్ని గుడ్లు తినాలి... పచ్చసొనతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Spicy Chicken: స్పైసీ చికెన్ లవర్స్ కోసం ప్రత్యేక రెసిపీ..! వెల్లుల్లి ఘాటుతో అదిరిపోయే టేస్ట్! Health Tips: రోజుకు ఎన్ని గుడ్లు తినాలి... పచ్చసొనతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Spicy Chicken: స్పైసీ చికెన్ లవర్స్ కోసం ప్రత్యేక రెసిపీ..! వెల్లుల్లి ఘాటుతో అదిరిపోయే టేస్ట్!

Legal News AP: కోర్టు మెట్లెక్కే సామాన్యుడికి న్యాయంపై నమ్మకం కలగాలి - తిరుపతిలో జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు..!

తిరుపతిలో నూతన కోర్టు భవనాల సముదాయానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులు ప్రజలకు న్యాయం అందించే ఆలయాలు కావాలని, న్యాయవాదులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సామాన్యులకు భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు

Published : 2026-03-01 12:55:00

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో న్యాయవ్యవస్థకు సంబంధించి ఒక కీలక అడుగు పడింది. నగరంలో నూతన కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో కోర్టు భవనాలకు పునాది రాయి వేయడం చాలా శుభసూచికమని కొనియాడారు. లోకనాయకుడు వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి భక్తులు ఎలా వస్తారో, అదే విధంగా ఈ నూతన భవనం కూడా సామాన్య ప్రజలకు న్యాయం అందించే మరో ఆలయంలా మారుతుందని తాను నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థ బలోపేతం గురించి మాట్లాడుతూ.. దేశంలో న్యాయవ్యవస్థ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతోందని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వృత్తిలోకి వస్తున్న యువ న్యాయవాదులు చాలా చురుకుగా పనిచేస్తున్నారని, వారి ప్రతిభ వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని ప్రశంసించారు. న్యాయవాదులు కేవలం వాదనలు వినిపించడమే కాకుండా, బాధితులకు మేలు జరగాలనే ఉద్దేశంతో సరైన దిశలో ఆలోచించినప్పుడే కక్షిదారులకు నిజమైన న్యాయం అందుతుందని ఆయన సూచించారు. న్యాయవాది చేసే ఆలోచన మీదనే ఒక వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుందని గుర్తుచేశారు.

ప్రజల నమ్మకం గురించి సీజేఐ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. మనిషికి ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు, డాక్టర్ దగ్గరకు వెళ్తే కచ్చితంగా నయమవుతుందనే బలమైన నమ్మకంతో ఆసుపత్రికి వెళ్తారని, అక్కడ వైద్యులు ఇచ్చే భరోసానే సగం రోగాన్ని తగ్గిస్తుందని చెప్పారు. సరిగ్గా అదే విధంగా, కోర్టు మెట్లు ఎక్కే సామాన్యుడికి కూడా "న్యాయస్థానానికి వెళ్తున్నాను.. నాకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది" అనే భరోసా కలగాలని ఆకాంక్షించారు. వ్యవస్థపై ప్రజల్లో ఉండే ఆ నమ్మకమే న్యాయవ్యవస్థకు అసలైన బలం అని ఆయన స్పష్టం చేశారు.

న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత కేవలం న్యాయమూర్తుల మీదనే కాకుండా, ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే న్యాయవాదుల నుంచి ఉన్నత అధికారుల వరకు అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే సామాన్యుడికి న్యాయం చేరువవుతుందని చెప్పారు. ఈ కొత్త భవన సముదాయం అందుబాటులోకి వస్తే న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం కావడమే కాకుండా, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుపతిలో కోర్టు భవనాల నిర్మాణం వేగంగా పూర్తి కావాలని, ఇది భవిష్యత్తులో ఎంతోమందికి న్యాయం చేకూర్చే పవిత్ర వేదికగా నిలవాలని జస్టిస్ సూర్యకాంత్ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నత న్యాయమూర్తులు, న్యాయవాదులు  జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ నూతన భవనం ఆధునిక హంగులతో, సాంకేతిక పరిజ్ఞానంతో సామాన్యులకు న్యాయ సేవలను సులభతరం చేయనుంది.

Spotlight

Read More →