Electricity Rates: విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు సమీక్ష..! ఛార్జీల తగ్గింపుకు గ్రీన్ సిగ్నల్! Praja Vedika: రేపు (12/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu Naidu: డ్వాక్రా ఉత్పత్తులకు కార్పొరేట్ బ్రాండింగ్! సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు..! Nara Lokesh: విజయ డెయిరీ వివాదం... మంత్రి నారా లోకేష్ ట్వీట్! Kavuri SambasivaRao: కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కన్నుమూత! నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి! Quantum Valley : 9 నెలల్లో సిద్ధం కానున్న అమరావతి క్వాంటం కంప్యూటర్ సెంటర్! Praja Vedika: నేడు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! CRDA: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం... రూ. 119 కోట్లతో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు! ఎక్కడంటే... Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! Electricity Rates: విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు సమీక్ష..! ఛార్జీల తగ్గింపుకు గ్రీన్ సిగ్నల్! Praja Vedika: రేపు (12/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu Naidu: డ్వాక్రా ఉత్పత్తులకు కార్పొరేట్ బ్రాండింగ్! సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు..! Nara Lokesh: విజయ డెయిరీ వివాదం... మంత్రి నారా లోకేష్ ట్వీట్! Kavuri SambasivaRao: కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కన్నుమూత! నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి! Quantum Valley : 9 నెలల్లో సిద్ధం కానున్న అమరావతి క్వాంటం కంప్యూటర్ సెంటర్! Praja Vedika: నేడు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! CRDA: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం... రూ. 119 కోట్లతో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు! ఎక్కడంటే... Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు!

parthasarathy: ఏలూరులో శిశువు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి.. మంత్రి పార్థసారథి సీరియస్..

parthasarathy Speech: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతిచెందిన ఘటనపై రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార మరియు పౌరసంబంధాలశాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు.

Published : 2026-03-11 16:12:00
  •  పేషెంట్ల పట్ల ఇంత నిర్లక్ష్యం ఏంటి?
     
  • ఎన్నిసార్లు చెప్పినా....ఏలూరు జీజీహెచ్ సిబ్బంది తీరు మారదా?

parthasarathy Speech: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతిచెందిన ఘటనపై రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార మరియు పౌరసంబంధాలశాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో బిజీబిజీగా ఉన్న మంత్రికి ఏలూరు జీజీహెచ్ లో జరిగిన విషయం తెలిసిన వెంటనే ఘటనపై ఆరాతీశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో జాగ్రత్తగా ఉండాలని, పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఏలూరు జీజీహెచ్ సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏలూరు జీజీహెచ్ ఆర్.ఎం.ఓ పై మండిపడ్డారు. తాజాగా నూజివీడు నియోజకవర్గం, ముసునూరు మండలం, గోపవరం గ్రామానికి చెందిన మహిళ నాగలక్ష్మి డెలివరీ నిమిత్తం ఏలూరు జీజీహెచ్ లో చేరారు. 

నాగలక్ష్మికి డెలివరీ చేయాల్సిన డాక్టర్ అథియా డెలివరీ డేట్ ఇంకా రాలేదనే కారణంతో డెలివరీ ఆలస్యం చేశారని, దీంతో శిశువు మృతిచెందిందని నాగలక్ష్మీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఏలూరు జీజీహెచ్ ఆర్.ఎం.ఓ కు మంత్రి కొలుసు పార్థసారథి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. శిశువు చనిపోయిన విషయాన్ని నాగలక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచి, బాధ్యత లేకుండా వెళ్లిపోవడం ఏంటని నిలదీశారు? గతంలోనూ నూజివీడు నియోజకవర్గానికి చెందిన వారి విషయంలోనూ ఏలూరు జీజీహెచ్ సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని, తనకు నివేదిక ఇచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్.ఎం.ఓ ను మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే ఎవర్నీ సహించేది లేదని తేల్చిచెప్పారు.

Spotlight

Read More →