AIFB: కవితకు వడ్డేపల్లి ట్విస్ట్... గెలిచిన తర్వాత ఏఐఎఫ్బీ నేతల సంచలన ప్రకటన! Krishna District Jagananna Colonies: ప్రకృతిని తుడిచిపెట్టారు.. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.. బయటపడ్డ 'మడ' కుంభకోణం! Chandrababu Naidu: శ్రీకాకుళం–విజయనగరం–విశాఖకు మెగా ప్రాజెక్ట్..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Irrigation Projects 2026: సీమకు జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు! New Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్! కొత్త పెన్షన్ల దరఖాస్తులకు రంగం సిద్ధం! Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్! Horticultural Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 1 లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌! Budget meetings: ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్.. ఏపీలో చేనేత రంగం సరికొత్త ప్రస్థానం! Ambati dialogue viral: అంబటి సైగలు చూసి అల్లు అర్జున్ కూడా సిగ్గుపడాలి.. టీడీపీ ఎమ్మెల్సీ నేత ఫైర్.! Trump–Modi: మోదీపై ట్రంప్ కామెంట్స్..! విదేశాంగ శాఖ స్పందనతో కొత్త మలుపు! AIFB: కవితకు వడ్డేపల్లి ట్విస్ట్... గెలిచిన తర్వాత ఏఐఎఫ్బీ నేతల సంచలన ప్రకటన! Krishna District Jagananna Colonies: ప్రకృతిని తుడిచిపెట్టారు.. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.. బయటపడ్డ 'మడ' కుంభకోణం! Chandrababu Naidu: శ్రీకాకుళం–విజయనగరం–విశాఖకు మెగా ప్రాజెక్ట్..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Irrigation Projects 2026: సీమకు జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు! New Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్! కొత్త పెన్షన్ల దరఖాస్తులకు రంగం సిద్ధం! Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్! Horticultural Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 1 లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌! Budget meetings: ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్.. ఏపీలో చేనేత రంగం సరికొత్త ప్రస్థానం! Ambati dialogue viral: అంబటి సైగలు చూసి అల్లు అర్జున్ కూడా సిగ్గుపడాలి.. టీడీపీ ఎమ్మెల్సీ నేత ఫైర్.! Trump–Modi: మోదీపై ట్రంప్ కామెంట్స్..! విదేశాంగ శాఖ స్పందనతో కొత్త మలుపు!

Rahul vs Modi 2026: విపక్ష నేతగా విఫలమవుతున్నారా? పార్లమెంట్‌లో రాహుల్ తీరుపై సొంత పార్టీలోనే గుసగుసలు!

Rahul Gandhi's Political : పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వ్యూహాలు ఆయనకే రివర్స్ అవుతున్నాయా? నరవాణే పుస్తక వివాదం నుంచి ఇండో-అమెరికా డీల్ వరకు ఆయన చేస్తున్న ఆరోపణల్లో పస లేదని విశ్లేషకులు ఎందుకు భావిస్తున్నారు? విపక్ష నేతగా రాహుల్ వైఫల్యంపై ప్రత్యేక విశ్లేషణ...

Published : 2026-02-13 09:48:00

సొంత పార్టీలోనే అసహనం..

సొంత ఉచ్చులో రాహుల్?

రాని పుస్తకం.. రచ్చెక్కువ..

దేశంలో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఎదగాల్సిన రాహుల్ గాంధీ (Rahul Gandhi), అనవసరమైన అంశాల్లో తలదూర్చి తన రాజకీయ భవిష్యత్తును తనే ఇబ్బందుల్లో నెట్టేసుకుంటున్నారా? ఆయన వేస్తున్న ఎత్తుగడలు మోదీని ఇరికించడానికి బదులు, ఆయన్నే నవ్వుల పాలు చేస్తున్నాయా? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 'అవును' అనే సమాధానమే  వినిపిస్తుందని రాజకీయ విశ్లేషణకు అభిప్రాయపడుతున్నారు.

పార్లమెంట్‌లో గత వారం రోజులుగా రాహుల్ గాంధీ చేస్తున్న హంగామా చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే రాసిన ఓ పుస్తకం గురించి ఆయన నానా రచ్చ చేశారు. అసలు విచిత్రం ఏంటంటే, ఆ పుస్తకం ఇంకా మార్కెట్‌లోకి రాలేదు, కేవలం ప్రీ-బుకింగ్ మాత్రమే జరుగుతోంది. చేతిలో పుస్తకం లేకుండా, అందులో ఏముందో తెలియకుండా పార్లమెంట్‌ను 8 రోజుల పాటు స్తంభింపజేయడం ఏంటని సొంత పార్టీ ఎంపీలే విసుగు చెందుతున్నారు. రాహుల్ వెనుక కూర్చున్న కాంగ్రెస్ నేతల ముఖాల్లో కనిపిస్తున్న నీరసమే దీనికి నిదర్శనం అని అభిప్రాయపడుతున్నారు.

నరవాణే పుస్తకం విషయంలో పప్పులో కాలేశానని అర్థం కాగానే, రాహుల్ రూటు మార్చారు. వెంటనే ఇండో-అమెరికా డీల్ (India-america Deal) గురించి అందుకున్నారు. భారతదేశాన్ని అమ్మేస్తున్నారంటూ పాత పల్లవినే అందుకున్నారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం చూపలేకపోతున్నారు. ఒకపక్క ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తుంటే, రాహుల్ మాత్రం విదేశీ శక్తుల స్క్రిప్టు చదువుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

బడ్జెట్ లాంటి సీరియస్ విషయంలో రాహుల్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఎంతో మెరుగ్గా మాట్లాడారు. చద్దా బడ్జెట్‌లోని లోపాలను ఎత్తిచూపుతూనే, అర్థవంతమైన విమర్శలు చేశారు. కానీ రాహుల్ మాత్రం బడ్జెట్ వదిలేసి 'జుడో-జుజుత్సు' లాంటి మార్షల్ ఆర్ట్స్ గురించి సభలో 10 నిమిషాల పాటు లెక్చర్లు ఇచ్చారు. అసలు సందర్భం ఏంటి? ఆయన మాట్లాడుతున్నదేంటి? అని స్పీకర్‌తో పాటు సొంత పార్టీ వాళ్లు కూడా తలలు పట్టుకున్నారు.

గతంలో అదానీ, అంబానీ అంటూ రాహుల్ గొంతు చించుకున్నప్పుడు విదేశాల నుంచి ఏదో ఒక రూపంలో సపోర్ట్ వచ్చేది. కానీ వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో, రాహుల్ వల్ల మోదీని ఎదుర్కోవడం సాధ్యం కాదని విదేశీ మేధావులు కూడా ఫిక్స్ అయిపోయినట్లున్నారు. అందుకే ఈ మధ్య విదేశీ పర్యటనల్లో కూడా రాహుల్‌కు మునుపటి లాంటి ప్రాధాన్యత దక్కడం లేదు.

ప్రజా సమస్యల మీద పోరాడాల్సింది పోయి, కేవలం విమర్శల కోసమే విమర్శలు చేస్తూ రాహుల్ ఒక విదూషకుడిలా మారుతున్నారనే ఆందోళన రాజకీయ వర్గాల్లో ఉంది. లోక్‌సభలో విపక్ష నేత అంటే బాధ్యతాయుతంగా ఉండాలి కానీ, ఇలా తన చుట్టూ తానే ఉచ్చు బిగించుకుంటే రాబోయే 2029 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు కష్టాలు  తప్పవేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Spotlight

Read More →