AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు.. Revanth Reddy: దక్షిణాది ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే వారిపై తేజస్వి సూర్య ఫైర్.! AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు.. Revanth Reddy: దక్షిణాది ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే వారిపై తేజస్వి సూర్య ఫైర్.!

Greenfield Express Highway: ఏపీలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవే! రూ.4,600 కోట్లతో... ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు!

Greenfield Express Highway: ఈ హైవే మొత్తం 162 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమైంది. ఇందులో 106 కిలోమీటర్లు తెలంగాణలో, 57 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.

Published : 2026-03-02 06:52:00

ఏపీ, తెలంగాణలకు కొత్త కనెక్టివిటీ…

ఖమ్మం-దేవరపల్లి హైవే సిద్ధం…

 హైదరాబాద్-విశాఖ దూరం 56 కి.మీ తగ్గింపు

Greenfield Express Highway: ఖమ్మం - దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే త్వరలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ట్విట్టర్ వేదికగా తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ నాలుగు వరుసల హైవే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇది అందుబాటులోకి వస్తే వాహనదారులకు ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది.

ఈ హైవే మొత్తం 162 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమైంది. ఇందులో 106 కిలోమీటర్లు తెలంగాణలో, 57 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఖమ్మం నుంచి ప్రారంభమై, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వద్ద ఇది ముగుస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 4,609 కోట్లు ఖర్చు చేశారు.

ఈ కొత్త హైవే వల్ల హైదరాబాద్ నుంచి రాజమండ్రి మరియు విశాఖపట్నం వెళ్లేవారికి చాలా లాభం చేకూరుతుంది. విజయవాడ మీదుగా వెళ్లే అవసరం లేకుండా, నేరుగా ప్రయాణించవచ్చు. దీని వల్ల ప్రయాణ దూరం సుమారు 56 కిలోమీటర్లు తగ్గుతుంది, అలాగే సమయం కూడా ఆదా అవుతుంది.

ప్రయాణికుల భద్రత కోసం ఈ హైవేపై ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక సిసిటివి కెమెరా ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో వెలుతురు కోసం సౌరశక్తితో పనిచేసే లైట్లను అమర్చారు. హైవేపై కేవలం 9 చోట్ల మాత్రమే వాహనాలు ఎక్కడానికి, దిగడానికి అవకాశం కల్పించారు.

ఏప్రిల్ నాటికి ఈ హైవేను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ ఛార్జీలు (Toll Charges) వసూలు చేస్తారు. ఈ హైవే పూర్తయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది.

Spotlight

Read More →